Bigg Boss 10:బిగ్ బాస్ 10.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇది.. అయితే కనీ విని ఎరుగని రీతిలో మిగిలిన 9 సీజన్లతో పోల్చుకుంటే పూర్తి భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ సీజన్. ఊహించని ట్విస్టులు, సూట్ కేస్ ఆఫర్లు, మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అన్నీ కూడా ఆడియన్స్ లో సరికొత్త ఆసక్తిని కలిగిస్తున్నాయి . నెక్స్ట్ ఏంటి? అనే ఉత్సుకత కలిగిస్తున్న ఈ షో ఇప్పటికే ఆరు వారాలు పూర్తిచేసుకుంది.. ఐదు వారాలకు గానూ ఆరు మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరవ వారం శాలిని లేదా వర్షిని ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. షాలిని బయటకు వచ్చింది. కానీ ఆమెను ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్ కి పంపించి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశారు నాగార్జున.
ఇకపోతే 43వ రోజుకు సంబంధించి తాజా ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. సోమవారం అనగానే ఎప్పటిలాగే ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ గట్టిగానే సాగుతుంది. అలా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ నీతూ.. వర్షినినీ నామినేట్ చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ముఖేష్ ని అడ్డం పెట్టుకొని సర్వైవ్ అవుతోంది అంటూ ఆమె చేసిన కామెంట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..
నామినేషన్ ప్రక్రియను మొదలు పెడుతున్నాం అంటూ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయగానే.. ఝాన్సీ రామకృష్ణను నామినేట్ చేస్తూ.. నువ్వు షాలినిని కావాలని నెట్టినావో తెలియదు. అది అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ వెంటనే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగడం నాకు తప్పనిపించింది అంటూ అసలు కారణం లేని ఒక పాయింట్ని నామినేషన్ లోకి తీసుకురావడం కాస్త విడ్డూరంగానే అనిపించింది. దీనికి తగ్గట్టుగానే రామకృష్ణ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.
also read:ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!
తర్వాత నీతూ.. వర్షినిని నామినేట్ చేస్తూ.. నీకోసం నువ్వు స్టాండ్ తీసుకొని ఆట ఆడలేకపోయావు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. దీనికి వర్షిని మాట్లాడుతూ..” మరి మీరు ఎందుకు రాలేదు ?”అని అడిగితే “నేను అబ్బాయిలతో కూడా ఆడతానని చెప్పాను” అంటూ నీతూ తన అభిప్రాయాన్ని చెప్తుంది.. ఇక వర్షిని అక్కడితో ఆగకుండా ఆగమమ్మా ఆగు అంటూ చెబుతుంటే.. నీతూ అలా అనకు అంటూ చెప్పింది. నీతూ మాట్లాడుతూ..,” ముఖేష్ ను అడ్డుపెట్టుకొని ఈ ఇంట్లో నువ్వు సర్వైవ్ అవుతున్నావు” అంటూ నీతూ చెప్పింది. ఇక వెంటనే ముఖేష్ మాట్లాడుతూ బిగ్ బాస్ చెప్పిన రూల్స్ బ్రేక్ చేయలేదు. అసలు బిగ్ బాస్ ఆట ఏంటో మీకు అర్థం కావడం లేదు అంటూ అన్నాడు. ఇక వర్షిని దమ్ముంటే నాతో మాట్లాడు… ఇక్కడ చూసి మాట్లాడు అంటూ రెచ్చిపోయింది వర్షిని. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నామినేషన్ మాటల యుద్ధం గా మారిపోయింది.