E-Paper
Advertisement

పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా? షుగర్ లేకుండా ఇలా హెల్తీ బాదం స్వీట్ చేసి పెట్టండి!

పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా? షుగర్ లేకుండా ఇలా హెల్తీ బాదం స్వీట్ చేసి పెట్టండి!
Advertisement

Badam Mithai: పిల్లలకి తెలివితేటలు పెరగాలన్నా, చదువుకున్నది గుర్తుండాలన్నా బాదం పప్పు చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. కానీ రోజూ అవే బాదం పప్పులు తినిపించాలంటే పిల్లలు కాస్త మారాం చేస్తారు. అలాంటప్పుడు బాదంతో ఎంతో రుచిగా, ఆరోగ్యంగా ఉండేలా ఇలా స్వీట్ చేసి పెట్టండి. దీని ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో మనం అస్సలు పంచదార వాడము, అంతా స్వచ్ఛమైన బెల్లంతోనే చేస్తాం. అందుకే దీన్ని బాదం సుఖ్ది అని కూడా అంటారు. రోజుకు ఒక ముక్క తిన్నా పిల్లల మెదడు చురుగ్గా మారుతుంది. వాళ్లకి కావలసిన బోలెడంత శక్తి కూడా అందుతుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ.

కావాల్సిన పదార్థాలు:

బాదం పప్పులు – ఒక కప్పు
గోధుమ పిండి అరకప్పు
శనగపిండి పావు కప్పు
తురిమిన బెల్లం – ఒక కప్పు
నెయ్యి – ముప్పావు కప్పు
యాలకుల పొడి – సరిపడా

Advertisement

Also Read: ఈ వంటకాలను డైట్‌లో చేర్చుకుంటే.. షుగర్ ఉన్నవాళ్లు ఇన్సులిన్ వాడాల్సిన పనిలేదు!

తయారీ విధానం:

ఫస్ట్ బాదం పప్పులను మిక్సీ పట్టుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ పిండిలా కాకుండా కొంచెం పలుకులుగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక గోధుమ పిండి, శనగపిండి వేసి మంట తగ్గించి నిదానంగా వేయించాలి. పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయిస్తేనే మిఠాయి టేస్ట్ అదిరిపోతుంది. పిండి కాస్త రంగు మారుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న బాదం పొడిని కూడా అందులో వేసి ఒక రెండు నిమిషాలు కలపాలి. మిశ్రమం అంతా దగ్గర పడి నెయ్యి కొంచెం పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి.

Advertisement

ఇప్పుడు ఆ వేడి కొంచెం తగ్గాక.. అంటే మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు తురిమిన బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ వేడికే బెల్లం చక్కగా కరిగి పిండిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో వేసి సమానంగా సర్దాలి. ఒక అరగంట ఆగాక మీకు నచ్చిన షేప్‌లో ముక్కలుగా కోసుకుంటే కమ్మని బాదం మిఠాయి రెడీ అయినట్టే.

బాదం స్వీట్‌తో ప్రయోజనాలు:

ఈ బాదం మిఠాయి కేవలం స్వీట్ లాగా మాత్రమే కాకుండా ఒక హెల్త్ టానిక్‌లా పనిచేస్తుంది. బాదంలో ఉండే పోషకాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి. మనం పంచదార వాడకుండా బెల్లం వాడుతున్నాం కాబట్టి బాడీకి ఐరన్ అందుతుంది. దీనివల్ల రక్తం కూడా బాగా పడుతుంది. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైమ్‌లో పిల్లలు బాగా అలసిపోతుంటారు. అలాంటప్పుడు ఈ మిఠాయి ఇస్తే వాళ్లకి మంచి ఎనర్జీ వస్తుంది. ఇంట్లోనే సహజంగా చేస్తున్నాం కాబట్టి.. ఎలాంటి భయం లేకుండా పిల్లలకి పెట్టొచ్చు.

Also Read: సమ్మర్‌లో బాడీ సూపర్ కూల్‌గా ఉండాలా? అయితే ఇంట్లోనే ఈ హెల్దీ డ్రింక్స్‌ను ట్రై చేయండి!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×