E-Paper
Advertisement

OnePlus Ace 6T: గేమింగ్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్.. స్మాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌‌తో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

OnePlus Ace 6T: గేమింగ్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్.. స్మాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌‌తో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!
Advertisement

OnePlus Ace 6T: ప్రముఖ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ Ace సిరీస్‌లో భాగంగా.. వన్‌ప్లస్ Ace 6T అనే కొత్త స్మార్ట్‌ఫోన్ చైనాలో విడుదలైంది. ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్, గేమింగ్, కూలింగ్, బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఆకట్టుకోనుంది. వన్‌ప్లస్ ఏస్ 6T హ్యాండ్ సెట్.. ప్రధాన హైలైట్ దాని ప్రాసెసర్. ఇది స్మాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌తో వచ్చిన ప్రపంచంలోని మొదటి స్మార్ట్‌ఫోన్. ఈ చిప్‌కు తోడు 16జీబీ LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్, కొత్తగా తీసుకొచ్చిన గేమింగ్ నెట్వర్క్ చిప్ G2, 3200Hz టచ్ సాంప్లింగ్ రేట్ సపోర్ట్ ఉన్నాయి.

గేమ్స్ ఆడినా వేడెక్కదు:

ఈ వన్‌ప్లస్ ఏస్ 6T స్మార్ట్‌ఫోన్‌ను గేమింగ్‌ కొరకు ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. దీనిలో నేటివ్ 165fps గేమింగ్ సపోర్ట్ ఉంది. దీంతో శాంప్లింగ్ రేట్ ఎక్కువగా అవసరమైన గేమ్స్‌లో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ ఫోన్‌లో Wind Chaser గేమ్ కెర్నల్ ద్వారా అన్ లిమిటెడ్ ఫుల్‌ఫ్రేమ్ గేమింగ్, ఇండస్ట్రీ లీడింగ్ 1% low FPS పెర్ఫార్మన్స్, GPU సూపర్ ఫ్రేమ్ రెండరింగ్ వంటి ఫీచర్లు గేమింగ్ అనుభవాన్ని సులతరం చేస్తాయి. ఇందులోని Glacier VC కూలింగ్ సిస్టం‌ను వేడిని తగ్గించడానికి రూపొందించారు. దీనిలో 43% పెద్ద వేపర్ లిక్విడ్ కూలింగ్ చాంబర్, గ్లేసియర్ థర్మల్ జెల్, గ్రాఫైట్ వాడటం వల్ల 50 శాతం మెరుగైన థర్మల్ పనితీరు అందిస్తుంది. దీనిలో మొత్తం 43,940mm² పెద్ద హీట్ డిసిపేషన్ ఏరియా OnePlus చరిత్రలోనే అతి పెద్దది అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: భారత మార్కెట్​లో రెడ్‌మీ 15C 5G లాంచ్.. ధరెంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

23 నిమిషాల్లో 50% ఛార్జ్:

OnePlus Ace 6T స్మార్ట్‌ఫోన్ 8300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో చాలా పెద్దది. 100W సూపర్ VOOC ఛార్జింగ్‌తో ఫోన్‌ను 1% నుంచి 50% వరకు కేవలం 23 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. అలాగే 55W PPS ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఇస్తాయి. ఇక కెమెరా విభాగంలో ఈ ఫోన్ 50MP సోనీ IMX906 ప్రధాన కెమెరా OISతో, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 4K 60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. అలాగే ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు.. IP66 + IP68 + IP69K పూర్తిస్థాయి ప్రొటెక్షన్ తో వన్‌ప్లస్ ఏస్ 6T దుమ్ము, నీరు, వేడి, హై ప్రెషర్ వాటర్ జెట్లకు కూడా అత్యధిక స్థాయి ప్రొటెక్షన్ అందిస్తుంది.

రూ.2500 డిస్కౌంట్:

Advertisement

వన్‌ప్లస్ ఏస్ 6T హ్యాండ్ సెట్.. గ్రీన్, ఫ్లాష్ బ్లాక్, ఎలక్ట్రిక్ పర్పుల్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది. అలాగే ప్రత్యేక జెన్షిన్ ఇంపాక్ట్ కమిసాటో అయాకా ఎడిషన్ కూడా ఉంటుంది. అంతేకాదు.. మంచు నీలం కలర్‌తో వచ్చే ఈ స్పెషల్ ఎడిషన్ పూర్తి UI కస్టమైజేషన్, కస్టమ్ గిఫ్ట్ బాక్స్, టాయ్స్, చార్జింగ్ కిట్ మరెన్నో ప్రత్యేక ఐటమ్స్‌తో వస్తుంది. ఇక ఈ ఫోన్ ప్రారంభ ధరలో రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర దాదాపు రూ.33,000 ఉండవచ్చు. అయితే ఈ ఫోన్ డిసెంబరు 17న గ్లోబల్‌గా లాంచ్ కాబోతుందని సంస్థ తెలిపింది. ఇక ఈ ఫోన్ భారతదేశంలో OnePlus 15R పేరుతో విడుదల కానుంది. కాకపోతే.. స్పెసిఫికేషన్లలో కొంత మార్పులుండే అవకాశం ఉంటుంది.

Also Read: అమెజాన్‌లో అమేజింగ్ ఆఫర్.. సరసమైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×