E-Paper
Advertisement

IndiGo Flight: ప్రయాణీకులకు ఇండిగో క్షమాపణలు, రీఫండ్ పై కీలక ప్రకటన!

IndiGo Flight: ప్రయాణీకులకు ఇండిగో క్షమాపణలు, రీఫండ్ పై కీలక ప్రకటన!
Advertisement

IndiGo Refund: సిబ్బంది కొరత.. ఇతర సాంకేతిక కారణాలతో గత మూడు రోజులుగా ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది విమాన సర్వీసులను రద్దయ్యాయి. ఎయిర్‌ పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ వ్యాప్తంగా ఇవాళ అర్థరాత్రి వరకు ఏకంగా 2,200లకు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అదే సమయంలో ప్రయాణీకులకు కలిగిన అంతరాయానికి చింతిస్తూ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. క్యాన్సిల్ అయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణీకులందరికీ రీఫండ్ చేయనున్నట్లు ప్రకటించించింది.

 DGCA నిబంధనలు ఏం చెప్తున్నాయంటే?

Advertisement

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూల్స్ ప్రకారం, విమాన సర్వీసు రద్దు చేసినప్పుడు విమానయాన సంస్థలు పూర్తి రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక విమానయాన సంస్థ విమానాన్ని రద్దు చేసినప్పుడు, బయలుదేరడానికి కనీసం రెండు వారాల ముందు ప్రయాణీకులకు తెలియజేయాలి. టికెట్ కు సంబంధించిన పూర్తి రీఫండ్ ఇవ్వడం లేదంటే ప్రత్యామ్నాయ విమాన ప్రయాణానికి అవకాశం కల్పించాలి.  రద్దు గురించి  కనీసం 24 గంటల ముందుగానే తెలియజేస్తే, ప్రయాణీకుడు పూర్తి వాపసు లేదంటే ప్రత్యామ్నాయ విమానాన్ని ఎంచుకోవచ్చు.

విమానయాన సంస్థ సకాలంలో సమాచారం ఇవ్వడంలో విఫలమైతే,  ప్రయాణికుడు ఒకే టికెట్‌పై కనెక్టింగ్ ఫ్లైట్‌ను మిస్ అయితే, ఒక గంట వరకు విమానాలకు రూ.5,000, రెండు గంటల వరకు విమానాలకురూ.7,500, రెండు గంటలు దాటిన విమానాలకు రూ.10,000 పరిహారం అందించాల్సి ఉంటుంది. అటు ప్రయాణికులకు విమానాశ్రయంలో వేచి ఉండేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను విమాన సంస్థ కల్పించాల్సి ఉంటుంది. ప్రయాణీకుడు కాంటాక్ట్ వివరాలను అందించకపోతే ఎటువంటి పరిహారం వర్తించదు. ఎయిర్‌ లైన్ నియంత్రణకు మించి అసాధారణ పరిస్థితుల కారణంగా రద్దు జరిగితే ఎటువంటి రీఫండ్ ఉండదు.

విమాన ఆలస్యానికి రీఫండ్ రూల్స్ 

Advertisement

విమానం ఆలస్యం అయినప్పుడు విమానయాన సంస్థలు ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణీకులు సమయానికి చెక్ ఇన్ చేసి, విమానం ఆలస్యమవుతుందని భావిస్తే, వారికి ఉచితంగా ఫుడ్ అందించడంతో పాటు రిఫ్రెష్‌మెంట్ సౌకర్యాలను కల్పించాయి. దగ్గరి విమాన ప్రయాణాలకు రెండు గంటలు, మిడ్ రేంజ్ విమానాలకు మూడు గంటలు, లాంగ్ రేంజ్ విమానాలకు నాలుగు గంటల వరకు ఆలస్యం అయితే ఈ నిబంధనలు వర్తిస్తాయి. దేశీయ విమానం ఆరు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అవుతుందని భావిస్తే, ఆరు గంటలలోపు ప్రత్యామ్నాయ విమానం లేదంటే  పూర్తి వాపసు అందించాలి. ఆలస్యం 24 గంటలు దాటితే, లేదంటే రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య రాత్రి విమానం ఆరు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, ఎయిర్‌లైన్ అదనపు సౌకర్యాలను అందించాలి. హోటల్ బస, రవాణా వంటి సౌకర్యాలను అందించాలి. అయితే, అసాధారణ సంఘటనల వల్ల విమానం ఆలస్యం జరిగితే ఎయిర్‌లైన్స్ ఈ ప్రయోజనాలను అందించాల్సిన అవసరం లేదు.

ఇండిగో సంస్థ ఏం చెప్పిందంటే?

అటు ఇండిగో తాజాగా తన ప్రకటనలో అనివార్యకారణాలతో విమానాలు రద్దు అయ్యాయని ప్రకటించింది. అయితే, విమానాలు రద్దు అయిన ప్రయాణీకులకు రీఫండ్ అందించనున్నట్లు తెలిపింది.

Read Also: ఇండిగో ఇబ్బందుల దృష్ట్యా DGCA కీలక నిర్ణయం.. ఆ నిబంధనల్లో మార్పులు!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×