E-Paper
Advertisement

Redmi 15C 5G: భారత మార్కెట్​లో రెడ్‌మీ 15C 5G లాంచ్.. ధరెంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Redmi 15C 5G: భారత మార్కెట్​లో రెడ్‌మీ 15C 5G లాంచ్.. ధరెంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Advertisement

Redmi 15C 5G: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మీ లవర్స్‌కు గుడ్ న్యూస్. షావోమీ భారతదేశంలో ‘Redmi 15C 5G’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల HD+ స్క్రీన్‌, అలాగే 50MP ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా షావోమీ హైపర్‌ఓఎస్ 2పై రన్ అవుతుంది. ఈ రెడ్‌మీ 15C 5G స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి వివరాలపై ఓ లుక్కేసేద్దాం రండి..

రెడ్‌మీ 15C 5G ధర:

ఈ Redmi 15C 5G స్మార్ట్‌ఫోన్ డస్క్ పర్పుల్, మూన్‌లైట్ బ్లూ మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 4జీబీ + 128జీబీ మోడల్ ధర రూ.12,499, 6జీబీ + 128జీబీ మోడల్ ధర రూ.13,999, 8జీబీ + 128జీబీ స్టోరేజీతో కూడిన టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ రూ.15,499 ధరకు పొందొచ్చు. ఈ రెడ్‌మీ కొత్తఫోన్ డిసెంబరు 11 నుంచి ప్రముఖ ఆ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండనుంది.

Advertisement

Also Read: ఏఐ కెమెరాతో వచ్చేస్తోన్న లావా న్యూ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్‌!

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇలా:

ఈ స్మార్ట్‌ఫోన్ 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల HD+ డిస్‌ప్లే‌ను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 810 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే TUV రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అలాగే 6nm ప్రాసెస్‌ కలిగి ఉంది. LPDDR4X RAM, UFS 2.2తో సహా 4జీబీ నుంచి 8జీబీ RAM కలిగి ఉంటుంది.

బ్యాటరీ, కెమెరా విషయానికొస్తే:

Advertisement

Redmi 15C 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOS2తో రన్ అవుతుంది. దీని‌లో 50MP మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా ఉంటుంది. అలాగే సెల్ఫీ కెమెరా 8MP సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. 3.5mm ఆడియో జాక్ FM రేడియో కలిగి ఉంది. 6,000mAh భారీ బ్యాటరీ లైఫ్‌‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ 33-వాట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అలాగే దీని బరువు 211 గ్రాములు ఉండి, IP64-రేటెడ్ కలిగి ఉంటుంది.

Also Read: ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ!

Related News

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

Big Stories

Advertisement
×