E-Paper
Advertisement

Google Photos Battery Save: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసే గూగుల్ ఫొటోస్.. ఎలా పనిచేస్తుందంటే

Google Photos Battery Save: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసే గూగుల్ ఫొటోస్.. ఎలా పనిచేస్తుందంటే
Advertisement

Google Photos Battery Save| చాలా మంది ఫోటోలు, వీడియోలను సురక్షితంగా క్లౌడ్‌లో సేవ్ చేయడానికి గూగుల్ ఫోటోస్ యాప్ ఉపయోగిస్తారు. ఇది డివైస్‌ల మధ్య సులభంగా ఫోటోలు చూడడానికి సహాయపడుతుంది. త్వరలో ఈ యాప్‌లో మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసే కొత్త ఫీచర్ తీసుకురావచ్చు. ఈ సమాచారం బీటా వెర్షన్ APK ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇంకా ఈ ఫీచర్ ప్రయోగ దశలోనే ఉంది. త్వరలోనే స్టేబుల్ వెర్షన్‌ అందరికీ అందుబాటులోకి రావచ్చు.

గూగుల్ ఫోటోస్‌లో బ్యాటరీ సేవర్ ఆప్షన్

ఆండ్రాయిడ్ అథారిటీ గూగుల్ ఫోటోస్ బీటా APKని విశ్లేషించింది. అందులో కొత్త బ్యాటరీ సేవింగ్ ఆప్షన్ ఉండటం కనుగొన్నారు. ఫోటో బ్యాకప్ సెట్టింగ్స్ ఆన్‌లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ పనిచేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ సింకింగ్ స్పీడ్‌ను తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల బ్యాటరీ చాలా తక్కువగా వినియోగించుకుంటుంది. అయితే కొత్త ఫోటోలు ఇతర డివైస్‌లలో తక్షణమే కనిపించవు. బ్యాటరీ సేవింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ ఫీచర్ బ్యాటరీని ఎలా ఆదా చేస్తుంది?

Advertisement

ఫోటోలు, వీడియోల సింకింగ్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని తగ్గిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్ రన్ అవ్వడానికి యాప్ బ్యాటరీ తక్కువగా వాడుకుంటుంది. బ్యాకప్‌లు ఇప్పటికీ సురక్షితంగా జరుగుతాయి.
రియల్-టైమ్ సింక్ అవసరం లేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మాన్యువల్ సింక్ ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఆప్షన్ ఆన్ చేస్తే మల్టీ-డివైస్ ఇన్‌స్టంట్ సింక్ ఆఫ్ అవుతుంది. ఇది బ్యాటరీని మరింత ఆదా చేస్తుంది.

ఈ ఫీచర్ ఎవరికి ఉపయోగపడుతుంది?

ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ సమయం బయట గడిపేవారికి బ్యాటరీ ముఖ్యం. ఛార్జింగ్ సౌలభ్యం తక్కువగా ఉన్నప్పుడు ఇది సహాయపడుతుంది. ఫిట్‌నెస్ యూజర్లు, ఫోటోగ్రాఫర్లకు కూడా మంచి ఫీచర్. బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలనుకునేవారికి ఇది బెస్ట్.

లభ్యత, గూగుల్ ప్లాన్స్

Advertisement

గూగుల్ ఇంకా ఈ ఫీచర్ విడుదల గురించి అధికారికంగా ప్రకటించలేదు. బీటా ప్రోగ్రామ్‌లో టెస్టింగ్ కొనసాగుతోంది. త్వరలో స్టేబుల్ వెర్షన్ అప్‌డేట్‌లో రావచ్చు. అధికారిక ప్రకటన కోసం ఇంకొంత వేచి ఉండాలి.

గూగుల్ ఫోటోస్ యాప్ త్వరలో మరింత బ్యాటరీ ఫ్రెండ్లీ అవుతుంది. ఈ కొత్త ఫీచర్ బ్యాకప్ సురక్షితంగా, బ్యాటరీ కూడా తక్కువ వినియోగించుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ సింకింగ్‌పై యూజర్లకు మరింత కంట్రోల్ వస్తుంది. విడుదలైతే రోజువారీ ఫోన్ ఉపయోగాన్ని మెరుగుపరుస్తుంది.

Related News

సముద్రం అడుగున వింత రాళ్లు.. గాలి తగలగానే భగ్గుమంటూ మంటలు, కారణం ఏమిటీ?

వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్..చాటింగ్ స్టైల్ మారబోతోంది బాస్

యాప్స్, ఫొటోస్ డిలీట్ చేసినా స్టోరేజ్ ఫుల్ అని వస్తోందా? అయితే ఈ సీక్రెట్ ట్రిక్ ట్రై చేయండి!

ల్యాప్‌టాప్‌‌పై నీళ్లు పడ్డాయా? ఆన్ చేసే.. ముందు ఈ ఒక్క తప్పు చేయెద్దు!

విదేశాలకు వెళ్తున్నారా? రోమింగ్ బిల్లుల బెంగ వదిలేసి, ఇలా eSIM వాడేయండి!

రూ. 40వేలలోపే లగ్జరీ లుక్..ఆఫర్‌లో బెస్ట్ ఫ్రిజ్‌లు

కేవలం రూ.17 వేలకే హైయర్ ఫ్రిజ్.. అమెజాన్ సేల్‌లో కస్టమర్లకు పండగలాంటి ఆఫర్లు!

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

Big Stories

Advertisement
×