E-Paper
Advertisement

MG Majestor: ఎంజీ మెజెస్టర్‌ వచ్చేస్తోంది, లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన కంపెనీ!

MG Majestor: ఎంజీ మెజెస్టర్‌ వచ్చేస్తోంది, లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన కంపెనీ!
Advertisement

ప్రముఖ ఆటో మోబైల్ కంపెనీ ఎంజీ నుంచి మరో ప్లాగ్ షిప్ SUV విడుదలకానుంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన లాంచ్ డేట్ ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 12, 2026న ఈ కారును లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.   మెజెస్టర్‌ SUVని తొలిసారి ఆటో ఎక్స్‌ పో 2025లో కంపెనీ ప్రదర్శించింది. చాలా రోజులుగా ఈ కారును ఇండియన్ రోడ్స్ కంపెనీ మీద టెస్ట్ చేస్తోంది.

MG Majestor డిజైన్ గురించి..

ఎంజీ మెజెస్టర్‌ చైనా, సౌదీ అరేబియా లాంటి మార్కెట్లలో లభించే Maxus D90 SUV మాదిరిగా కనిపిస్తోంది. ఇది గ్లోస్ బ్లాక్ ఎలిమెంట్స్‌ తో కూడిన పెద్ద గ్రిల్‌ను కలిగి ఉంది. గ్రిల్ పక్కన LED హెడ్‌ లైట్స్ ఉన్నాయి. వాటి పైన అందమైన కనుబొమ్మ ఆకారంలో ఉన్న LED డేటైమ్ రన్నింగ్ లాంప్‌లు ఉన్నాయి. ముందు బంపర్ దిగువ భాగం మధ్యలో నల్లటి క్లాడింగ్ ఉంది. ఇది మెజెస్టర్‌ కు మంచి అందాన్ని అందిస్తోంది. వీల్ ఆర్చ్‌లు, మెజెస్టర్ ప్రొఫైల్ కింది భాగంలో బాడీ క్లాడింగ్ కొనసాగుతుంది. SUV గ్లోస్టర్‌ లా కనిపించే డ్యూయల్ టోన్ 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ను కలిగి ఉంటుంది. ఇందులో బ్లాక్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, కనెక్ట్ చేయబడిన LED టెయిల్ లైట్లు, ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ తో కూడిన బ్లాక్ బంపర్, రెండు వైపులా ఎగ్జాస్ట్ టిప్స్ ఉంటాయి.

MG మెజెస్టర్ ఇంటీరియర్, ఫీచర్లు

Advertisement

ఆటో ఎక్స్‌ పోలో మెజెస్టర్ క్యాబిన్ వివరాలు బయటకు రానప్పటికీ, ఇది Maxus D90 లాగా కనిపించే టెస్ట్ మ్యూల్‌ లో కనిపించింది. ఇండియా స్పెక్ మెజెస్టర్ 12.3 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్, అదే పరిమాణ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, కాలమ్ మౌంటెడ్ డ్రైవ్ సెలెక్టర్ స్టాంక్‌ తో 3 స్పోక్ స్టీరింగ్ వీల్‌ ను పొందే అవకాశం ఉంది.  మెజెస్టర్‌ను గ్లోస్టర్ కు పైస్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3 వరుసల SUV కంటే ఇది మరికొన్ని ఫీచర్లను పొందే అవకాశం ఉంది. గ్లోస్టర్ పనోరమిక్ సన్‌ రూఫ్, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, 12 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌ గేట్, హీటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లను పొందుతుంది. డ్రైవర్ సీటు కోసం అదనపు మసాజ్ ఫంక్షన్‌ ఉంటుంది.

MG మెజెస్టర్ పవర్‌ ట్రెయిన్

MG మెజెస్టర్ 2-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 216hp పవర్, 479Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.   ఈ ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో యాడ్ చేయబడి ఉంటుంది. ఇది అన్ని వీల్స్ కు పవర్ ను పంపుతుంది. చైనా స్పెక్ మాక్సస్ D90లోని అదే ఇంజిన్, అదే పవర్ ను పొందుతుంది.

ధర ఎంత ఉంటుంటదంటే?

Advertisement

MG మెజెస్టర్ ధర గ్లోస్టర్ కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దీని ధర రూ. 38.33 లక్షల నుంచి రూ. 42.49 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు ఇండియాలో టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్‌ తో పోటీ పడనుంది.

Read Also: విన్ ఫాస్ట్ నుంచి 3 కొత్త కార్లు, ఇంతకీ వాటి ప్రత్యేకత ఏటంటే?

Tags

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×