E-Paper
Advertisement

Amazon Prime Day Sale Laptops: ప్రైమ్ డే సేల్.. కొత్త ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు ఇవే!

Amazon Prime Day Sale Laptops: ప్రైమ్ డే సేల్.. కొత్త ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు ఇవే!
Advertisement

Amazon Prime Day Sale Laptops: అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ జూలై 20 నుంచి 21 వరకు కొనసాగుతుంది. ఈ 48 గంటల వ్యవధిలో ఈ-కామర్స్ వెబ్‌సైట్ అనేక డీల్స్, వివిధ రకాల డిస్కౌంట్లను అందించబోతోంది. డిస్కౌంట్ ఆఫర్లతో పాటు, డెల్, హెచ్‌పి వంటి టాప్ కంపెనీల సహకారంతో అమెజాన్ కొత్త గ్యాడ్జెట్లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వెబ్‌సైట్ ప్రకారం అమెజాన్‌లో హెచ్‌పి, డెల్,లెనెవో, ఆసుస్, సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.

అలానే వీటితో పాటుగా ఇతర టాప్ బ్రాండ్‌ల నుండి ఎలక్ట్రానిక్స్‌తో పాటు వాటి యాక్ససరీస్ 40 కంటే ఎక్కువ కొత్త డివైజ్‌లను విడుదల చేస్తుంది. ఇదిలా ఉంటే మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు కొత్త ల్యాప్‌టాప్‌లు కూడా వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా విడుదల చేయనున్న కొత్త ల్యాప్‌టాప్‌ల వివరాలను చూద్దాం.

Advertisement

Also Read: Amazon Prime Day Sale: ఏమి ఆఫర్లు రా నాయనా.. సగం ధరకే ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్లు.. ఒక్కరోజే ఛాన్!

అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా డెల్ తన సరికొత్త ఎక్స్‌పిఎస్, ఇన్‌స్పైరాన్ ఎఐ ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తుంది. Dell XPS 13లో Qualcomm Snapdragon X1 EliteX1E-80-100 ప్రాసెసర్ ఉంటుంది. ఇది కాకుండా Qualcomm Adrench GPU, గ్రాఫిక్స్ కోసం AI ఫీచర్లు కలిగి ఉంటుంది.

Advertisement

Dell Inspiron 14 Plus Qualcomm Snapdragon XPlus X1P-64-100 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. QHD+ డిస్‌ప్లేతో ఇది లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 21 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 15 గంటల 4K స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. ఇది కాకుండా ల్యాప్‌టాప్ వాయిస్ కమాండ్‌లకు సపోర్ట్ ఇచ్చే డ్యూయల్ మైక్రోఫోన్‌లతో మెరుగైన ఆడియోను అందిస్తోంది.

HP AMD Ryzen 5, Ryzen 7 ప్రాసెసర్‌లతో పెవిలియన్ ఏరో సిరీస్‌ను ప్రారంభించబోతోంది. HP పెవిలియన్ 16 ల్యాప్‌టాప్ అనేది రోజువారీ వినియోగదారులు, ప్రొఫిషినల్ యూజర్ల కోసం రూపొందించబడిన  ఫీచర్-ప్యాక్డ్ ల్యాప్‌టాప్. HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్ గేమింగ్ పవర్‌హౌస్. AMD Ryzen 7, Intel i5, i7 చిప్స్, NVIDIA GeForce RTXతో కొత్త Victus గేమింగ్ ల్యాప్‌టాప్‌లు వేగవంతమైన పర్ఫామెన్స్ అందిస్తాయి.

Also Read: Amazon Top 10 Smartphone Offers: అమోజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 10 ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్..!

ASUS వివోబుక్ 15, TUF సిరీస్ AMD రైజెన్, ఇంటెల్ కోర్ i7 బేస్డ్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తుంది. ఆసుస్ వివోబుక్ 15, ఇంటెల్ Core i5-1335U ప్రాసెసర్, ఇమ్మర్సివ్ నానోఎడ్జ్ డిస్‌ప్లే, AI నాయిస్ క్యాన్సిలేషన్, GlideX టెక్నాలజీతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. అయితే తాజా ASUS TUF గేమింగ్ ల్యాప్‌టాప్ మరింత భారీ గేమింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది AMD 7000 H సిరీస్ ప్రాసెసర్‌తో ఉంటుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×