BigTV English

Murari Re Release: మురారి- వసుంధరల పెళ్లి కార్డ్ చూశారా.. ?

Murari Re Release: మురారి- వసుంధరల పెళ్లి కార్డ్ చూశారా.. ?

Murari Re Release: టైటిల్ చూడగానే.. ఏంటి నిజమా.. ? నమ్రత ఏమైంది.. ? అని కంగారు పడకండి. మహేష్ బాబు నటించిన మురారి సినిమా రీరిలీజ్ ను అభిమానులు ఒక పండగలా చేస్తున్నారు.అందుకే ఈ హంగామా అంతా. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలీ బింద్రే జంటగా నటించిన ఈ చిత్రం 2021, ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.


మురారిగా మహేష్ బాబు, వసుంధరగా సోనాలీ కనిపించారు. అప్పట్లో ఈ సినిమా సృష్టించినన్నీ రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇక ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9 న మురారిని రీరిలీజ్ చేస్తున్నారు.  ఇప్పటి జనరేషన్ కోసం ఈ సినిమా లెంత్ ను 18 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు మేకర్స్ తెలిపారు.

ఇక ఈ సినిమా రీరిలీజ్ ను అభిమానులు ఒక పెళ్లిగా చేస్తున్నారు. అందులో మురారి, వసుంధరకు పెళ్లి ఎలా చేశారో అలానే.. థియేటర్ లో మురారి పెళ్లి అని తెలుపుతూ అభిమానులు పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేసి మిగతావారిని ఆహ్వానిస్తున్నారు.


చిరంజీవి మురారికి, చిలసౌ వసుంధరకు ఆగస్టు 9 న థియేటర్ లో వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. కావున మహేష్ ఫ్యాన్స్ తో పాటు మురారి సినిమా ఫ్యాన్స్ కూడా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి ప్రార్థన.. ఆహ్వానించేవారు మహేష్ బాబు ఫ్యాన్స్ అంటూ నిజంగానే వెడ్డింగ్ కార్డ్స్ ను ప్రింట్ చేసి పంచుతున్నారు.

ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. పిచ్చి ఉండొచ్చు కానీ, మరి ఇంత పిచ్చి ఉండకూడదు భయ్యా అని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం తప్పకుండా వస్తాం అని సరదాగా చెప్పుకొస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్యాన్స్ ఇంత రచ్చ చేస్తే థియేటర్ లో ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×