BigTV English
Advertisement

Amazon Prime Day Sale: ఏమి ఆఫర్లు రా నాయనా.. సగం ధరకే ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్లు.. ఒక్కరోజే ఛాన్!

Amazon Prime Day Sale: ఏమి ఆఫర్లు రా నాయనా.. సగం ధరకే ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్లు.. ఒక్కరోజే ఛాన్!

Amazon Prime Day Sale: మరో రెండు రోజుల్లో అమోజాన్ ఆఫర్ల వర్షం కురిపించనుంది. అందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ప్రైమ్ డే సేల్ జులై 20 అర్థరాత్రి 12 గంటలకు ప్రారంభం కానుంది. సేల్ 21 అర్థరాత్రి 12 గంటలకు ముగియనుంది. సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. సామ్‌సంగ్, ఆపిల్, ఐఫోన్, వనప్లస్‌‌తో సహా పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్లను భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో మీరు కూడా మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలంటే అందుబాటులో ఉండే డీల్స్ గురించి ఇప్పుడు చూద్దాం.


Samsung Galaxy S23 Ultra 5G
ప్రైమ్ డే సేల్ సందర్భంగా 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ ఆఫర్‌ల తర్వాత కేవలం 74,999 రూపాయల  ధరకే అందుబాటులో ఉంటుందని అమెజాన్ వెల్లడించింది. ఈ ధరలో 12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ అందుబాటులో ఉంటుంది. లాంచ్ సమయంలో ఈ మోడల్ ధర రూ. 1,24,999గా ఉంది. అంటే లాంచ్ ధర కంటే రూ.50,000 తక్కువకు సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ జూలై 20న లైవ్ కానుంది.

Also Read: Amazon Limited Offer on Mobile: లిమిటెడ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే డీల్.. త్వరగా ఫినిష్ చేయండి..!


iQOO Z7 Pro 5G
ఈ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్‌తో వస్తుంది. దీన్ని రూ.20,999కి సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ సమయంలో దీని ధర రూ.24,999. అంటే నేరుగా రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డీల్ కూడా జూలై 20న లైవ్ కానుంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7200 ప్రాసెసర్, 64-మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4600 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.

iPhone 13
అమోజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఐఫోన్ 13 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.47,999కి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ అసలు ధర రూ.59,900. అంటే మీరు సేల్‌లో రూ.11,901 డిస్కౌంట్ దక్కించుకోవచ్చు. ఫోన్‌లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్‌సెట్, 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ డీల్ కూడా జూలై 20 నుంచి లైవ్ కానుంది.

Samsung Galaxy S21 FE 5G
స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో కూడిన గెలాక్సీ S21 FE  8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ 27,999 రూపాయల ధరకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభించిన సమయంలో దీని ధర రూ. 49,999. అంటే లాంచ్ ధర కంటే రూ.22,000 తక్కువకే ఈ ఫోన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 6.4 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో వస్తుంది. ఇందులో 12-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Also Read: Huge Discount on iPhone: ఐఫోన్‌పై బెస్ట్ డీల్.. రూ.30 వేల డిస్కౌంట్.. వదిలితే కష్టమే గురూ!

OnePlus 12
12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన ఫోన్ ఆఫర్‌ల తర్వాత దీని ధర రూ. 52,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ప్రారంభించిన సమయంలో దీని ధర రూ.64,999గా ఉంది. అంటే లాంచ్ ధర కంటే రూ.12,000 తక్కువకే సేల్‌ సమయంలో దక్కించుకోవచ్చు. ఫోన్ 6.82 అంగుళాల 2K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS, సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5400 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

Big Stories

×