E-Paper
Advertisement

నాయిస్ ఐకాన్ 2 ఎలైట్ ఎడిషన్.. స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్!

నాయిస్ ఐకాన్ 2 ఎలైట్ ఎడిషన్.. స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్!
Advertisement

Noise Icon 2 Elite Edition: ప్రస్తుతం వాచ్ వాడటం అనేది కేవలం టైం చూడటానికి మాత్రమే కాదు.. అదొక స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారిపోయింది. ముఖ్యంగా.. స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ విపరీతంగా నడుస్తున్న ఈ తరుణంలో, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ అందించే వాచ్‌లను యూజర్లు ఎక్కువగా కోరుకుంటున్నారు. కస్టమర్ల ఈ ఆశలకు తగ్గట్టుగా.. నాయిస్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన మోడలే ఇది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.మెటాలిక్ బాడీ & 1.8 ఇంచుల డిస్‌ప్లే:

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్ మెయిన్ హైలైట్ దీని డిజైన్. దీనికి ఇచ్చిన మెటాలిక్ బాడీ వాచ్‌కు ఒక లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. సాధారణ ప్లాస్టిక్ బాడీ వాచ్‌లతో పోలిస్తే.. ఇది చాలా స్ట్రాంగ్‌గా, ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి తోడు.. పెద్దదైన 1.8 ఇంచుల డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల స్క్రీన్ పై ఉన్న నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, టైమ్ చాలా స్పష్టంగా, పెద్దవిగా కనిపిస్తాయి. ఎలైట్ బ్లాక్ స్ట్రాప్ ఈ వాచ్ అందాన్ని మరింత పెంచుతుంది.

2. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్:

ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌లో కాలింగ్ ఫీచర్ ఉండటం చాలా ముఖ్యం. నాయిస్ ఐకాన్ 2 ఎలైట్ ఎడిషన్‌లో.. అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ లభిస్తుంది. మీ స్మార్ట్‌ ఫోన్‌ను వాచ్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఫోన్ తీయకుండానే.. వాచ్‌లోనే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. దీనిలోని బిల్ట్-ఇన్ మైక్ , స్పీకర్ కాలింగ్ ఫీల్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆఫీస్‌లో లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3. హెల్త్ ,ట్‌నెస్ ట్రాకింగ్:

Advertisement

మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా అవసరం. ఈ స్మార్ట్‌ వాచ్‌లో వివిధ రకాల హెల్త్ మోనిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. హార్ట్ రేట్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చెకింగ్, స్లీప్ మోనిటరింగ్ వంటివి మీ ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ ట్రేస్ చేస్తూ ఉంటాయి. అలాగే.. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల జిమ్ చేసే వారికి, రన్నింగ్ లేదా వాకింగ్ చేసే వారికి ఇది పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ పార్టనర్‌గా పని చేస్తుంది.

4. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్:

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. నాయిస్ ఐకాన్ 2 ఎలైట్ ఎడిషన్‌లో.. పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి.. ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా నిరంతరంగా దీనిని ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను వాడినప్పటికీ బ్యాటరీ లైఫ్ అద్భుతంగా పని చేస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటం వల్ల చెమట పడినప్పుడు.. లేదా చిన్నపాటి నీటి బిందువులు పడినప్పుడు వాచ్‌కు ఎలాంటి సమస్య ఉండదు.

Also Read: రూ.1,251కే బెస్ట్ ఇయర్‌బడ్స్! ఫిలిప్స్ TAT1269 స్పెషల్స్ చూశారా?

5. ధర :

ఇన్ని ప్రీమియం ఫీచర్లు, మెటాలిక్ లుక్ , బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఇస్తూ మార్కెట్లో దీని ధర కేవలం రూ.1,699 మాత్రమే ఉండటం దీని స్పెషాలిటీ. బడ్జెట్ ధరలో.. ఒక స్టైలిష్ స్మార్ట్‌ వాచ్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా సూపర్ డీల్ అని చెప్పొచ్చు.

మీ చేతికి ప్రీమియం లుక్ తీసుకురావడంతో పాటు.. హెల్త్ ట్రాకింగ్ , కాలింగ్ ఫీచర్లు అందించే బెస్ట్ స్మార్ట్‌ వాచ్ కోసం చూస్తుంటే . ఈ మోడల్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మెటాలిక్ బాడీ, 1.8 ఇంచుల డిస్‌ప్లే, రూ. 1,699 ధరతో వస్తున్న.. ఈ వాచ్‌ను మీరు కూడా ఆన్‌లైన్‌లో ట్రై చేసి మీ లైఫ్‌స్టైల్‌ను మరింత స్మార్ట్‌గా మార్చుకోండి.

Related News

పాత ట్యాబ్‌ను కిచెన్ డిస్‌ప్లేగా ఇలా మార్చుకుంటే.. వంట చేయడం మరింత ఈజీ అవుతుంది!

ఫాస్ట్ ఛార్జర్ పేరుతో ఈ తప్పు చేస్తున్నారా? ఫోన్‌కే కాదు.. మీకూ ప్రమాదమే!

ఇంత తక్కువ ధరకి ఇలాంటి ల్యాప్‌టాప్స్ వస్తున్నాయా? ట్రెండింగ్‌లో ఉన్న 5 మోడల్స్‌ ఇవే!

రూ.600కే 48 గంటల బ్యాటరీ లైఫ్‌తో.. మ్యాజిక్‌జోన్ ఇయర్‌బడ్స్!

మీ ఇయర్‌బడ్స్‌లో ఒకవైపే సౌండ్ బాగా వినిపిస్తోందా? కొత్తవి కొనే ముందు ఇవి చెక్ చేయండి!

పెద్ద ట్విస్ట్ ఇచ్చిన యాపిల్.. ఫోల్డబుల్ ఐఫోన్ పేరు అల్ట్రా కాదట? లీకైన అసలు పేరు ఇదే!

రూ.1,251కే బెస్ట్ ఇయర్‌బడ్స్! ఫిలిప్స్ TAT1269 స్పెషల్స్ చూశారా?

Big Stories

Advertisement
×