Philips TAT1269 TWS: ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా వర్క్ చేసేటప్పుడు మంచి మ్యూజిక్ వినాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ బ్రాండ్ ఫిలిప్స్ మార్కెట్లోకి తీసుకొచ్చిన సరికొత్త ‘PHILIPS TAT1269 TWS Earbuds’ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అద్భుతమైన కాస్మిక్ బ్లూ కలర్, 40 గంటల లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, లేటెస్ట్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో.. వస్తున్న ఈ వైర్‌లెస్ హెడ్‌సెట్ ధర కేవలం రూ. 1,251 మాత్రమే. తక్కు ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ఇయర్‌బడ్స్ యొక్క పూర్తి ప్రత్యేకతలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
ఈ ఇయర్‌బడ్స్ చూడటానికి చాలా ఆకర్షణీయమైన ‘కాస్మిక్ బ్లూ’ కలర్‌లో లభిస్తాయి. వీటి డిజైన్ చాలా లైట్‌వెయిట్‌గా ఉండటం వల్ల చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. సౌకర్యవంతంగా ఫిట్ అవుతాయి. గంటల తరబడి పాటలు విన్నా లేదా కాల్స్‌లో మాట్లాడినా చెవులకు నొప్పి రాకుండా ఉండేలా.. వీటిని ఎర్గోనామిక్ స్టైల్‌లో డిజైన్ చేశారు.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో ముఖ్యంగా ఇయర్‌బడ్స్‌లో.. బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. ఫిలిప్స్ TAT1269 మోడల్ ఈ విషయంలో.. అస్సలు నిరాశపరచదు. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 40 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంటే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా బ్యాటరీ టెన్షన్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.
కనెక్షన్, స్పీడ్ కోసం ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 5.4వెర్షన్‌ను అందించారు. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్‌కు ఇయర్ బడ్స్ చిటికెలో కనెక్ట్ అవుతాయి. ఆడియో లాగ్స్ లేకుండా అత్యంత స్పష్టమైన కాలింగ్ ఫీల్, లాస్ లెస్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందిస్తుంది.
జిమ్‌లో వర్కవుట్లు చేసేటప్పుడు లేదా జాగింగ్ చేసేటప్పుడు చెమట పడుతుందనే.. టెన్షన్ ఇక అవసరం లేదు. ఈ ఇయర్ బడ్స్‌లో IPX5 రేటింగ్ గల వాటర్-రెసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. దీని వల్ల చిన్నపాటి వర్షం పడిన లేదా చెమట పడినప్పటికీ ఇయర్ బడ్స్‌కు ఎలాంటి ఇబ్బంది జరగదు.
Also Read: వీడియో వాచ్ ఫేసెస్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్..లుక్ అదుర్స్
ఈ ఇయర్ బడ్స్ అత్యంత ముఖ్యమైన హైలైట్ దీని ధర అనే చెప్పొచ్చు. మార్కెట్లో ఇన్ని ప్రీమియం ఫీచర్లు.. ఇస్తూ కేవలం రూ.1,251 ధరకే ఇది అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో..నమ్మకమైన బ్రాండ్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్.
మీ బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. లాంగ్ బ్యాటరీ లైఫ్ , స్టైలిష్ లుక్ అందించే బెస్ట్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కోసం వెతుకుతుంటే ఈ మోడల్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. బ్లూటూత్ 5.4, IPX5 ప్రొటెక్షన్, కేవలం రూ. 1,251 ధరతో వస్తున్న ఈ గాడ్జెట్‌ను మీరు కూడా ఆన్‌లైన్‌లో ట్రై చేసి మీ మ్యూజిక్ ఫీల్ మరింత పెంచుకోండి!