E-Paper
Advertisement

Noise Master Buds 2: భారత మార్కెట్లోకి నాయిస్ మాస్టర్ బడ్స్ 2.. ఇందులో వాడిన అత్యాధునిక ఫీచర్లు నెక్ట్స్ లెవెల్!

Noise Master Buds 2: భారత మార్కెట్లోకి నాయిస్ మాస్టర్ బడ్స్ 2.. ఇందులో వాడిన అత్యాధునిక ఫీచర్లు నెక్ట్స్ లెవెల్!
Advertisement

Noise Master Buds 2: అత్యాధునిక ఫీచర్లతో పాటు తక్కువ బడ్జెట్‌లో మంచి ఇయర్ బడ్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అలాంటి వారి కోసమే ప్రముఖ నాయిస్ సంస్థ నుంచి ‘నాయిస్ మాస్టర్ బడ్స్ 2’  భారత మార్కెట్లో విడుదలైంది. అంతర్జాతీయ టెక్ వేదిక CES 2026లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ డివైస్.. ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్, విజయ్ సేల్స్, క్రోమా, ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి. పాత మాస్టర్ బడ్స్‌కు కొనసాగింపుగా వస్తున్న ఈ సెకండ్ జనరేషన్ బడ్స్, అత్యాధునిక ఫీచర్లతో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోనున్నాయి.

బోస్ సౌండ్ టెక్నాలజీతో..

ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిలో ప్రఖ్యాత Sound by Bose టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల మ్యూజిక్‌లో ప్రతి నోట్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. సినిమా చూస్తున్నా లేదా గేమ్స్ ఆడుతున్నా సరికొత్త అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా ఈ బడ్స్‌లోని 360° స్పేషల్ ఆడియో, ఇంటెలిజెంట్ హెడ్ ట్రాకింగ్ ఫీచర్ వల్ల సౌండ్ మన చుట్టూ ఉన్నట్లుగా భ్రమ కలిగిస్తుంది. బయటి శబ్దాల వల్ల ఇబ్బంది కలగకుండా రీడిజైన్ చేసిన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థను దీనిలో అమర్చారు.

Advertisement

Also Read: రూపాయి కట్టకుండానే కొత్త ఫోన్ ఇంటికి.. రెనో, ఫైండ్‌పై కళ్లుచెదిరే ఆఫర్లు!

స్మార్ట్ ఫీచర్లు..

టెక్నాలజీ పరంగా ఈ బడ్స్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. 6 మైక్రోఫోన్లతో కూడిన ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మీ వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కేవలం తల ఊపడం ద్వారా కాల్స్ లేదా మ్యూజిక్‌ను నియంత్రించేలా 6 యాక్సిస్ IMU సెన్సార్‌ను ఇందులో అమర్చారు. మెటాలిక్ ఫినిష్‌తో ప్రీమియం లుక్‌లో ఉండే ఈ బడ్స్.. వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX5 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. బ్లూటూత్ v6.1, డ్యూయల్ డివైస్ పెయిరింగ్ వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు దీనిలో హైలైట్‌గా నిలుస్తాయి.

ధర వివరాలు:

Advertisement

బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ Noise Master Buds 2 ఏకంగా 30 గంటల ప్లేబ్యాక్ అందిస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 6 గంటల పాటు వాడుకోవచ్చు. ఈ సరికొత్త ఇయర్ బడ్స్ మార్చి 27న కార్బన్, ఔరమ్, మెర్క్యురీ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.999 చెల్లించి వీటిని ప్రీ బుక్ చేసుకోవచ్చు. లాంచ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అన్నీ కలుపుకుంటే ఇవి రూ.6,399 ధరకే లభించే అవకాశం ఉంది.

Also Read: 2.5K డిస్‌ప్లే, 6400mAh బ్యాటరీతో హువావే మేట్‌ప్యాడ్ మినీ.. ధర, పూర్తి వివరాలు ఇవే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×