E-Paper
Advertisement

Push Start-Stop In Cars: కార్లలో పుష్ స్టార్ట్, స్టాప్ బటన్.. లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయ్!

Push Start-Stop In Cars: కార్లలో పుష్ స్టార్ట్, స్టాప్ బటన్.. లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయ్!
Advertisement

పుష్ స్టార్ట్, స్టాప్ బటన్ కార్లలో కామన్ ఫీచర్ గా మారింది. చిన్న హ్యాచ్‌ బ్యాక్‌ లతో పాటు SUV లాంటి పెద్ద కార్లలోనూ ఈ ఫీచర్ కనిపిస్తుంది. కీని తిప్పడానికి బదులుగా, కీ ఫోబ్ కారు లోపల ఉన్నంత వరకు ఇంజిన్‌ ను స్టార్ట్ చేయడానికి లేదంటే ఆఫ్ చేయడానికి ఈ బటన్ ను నొక్కాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ చాలా మోడ్రన్ గా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రీమియంగానూ ఉంటుంది. అయితే, చాలా ఫీచర్ల మాదిరిగానే ఇది కూడా, కంప్లీట్ గా బాగుందని చెప్పలేం. కొన్ని లాభాలతో పాటు మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పుష్ స్టార్ట్, స్టాప్ ఫీచర్ తో లాభాలు  

ఈ ఫీచర్ తో కలిగే పెద్ద లాభం కన్వీనియెన్స్. చాలా సింపుల్ ఆపరేటింగ్ ఉంటుంది. ప్రతిసారీ కీ కోసం వెతకాల్సిన అవసరం లేదు. లోపల కూర్చుని.. బ్రేక్, క్లచ్ నొక్కి, బటన్‌ ను నొక్కితే సరిపోతుంది. సిటీ ట్రాఫిక్‌ లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.   ఇంకా చెప్పాలంటే భద్రతను కూడా అందిస్తుంది. కీ ఫోబ్ సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే కారు స్టార్ట్ అవుతుంది.  చాలా కార్లలో ఈ వ్యవస్థతో పాటు ఇంజిన్ ఇమ్మొబిలైజర్ కూడా లభిస్తుంది. అంతేకాదు, సాంప్రదాయ తాళాలు మెకానికల్ పార్ట్స్ మీద ఆధారపడి ఉంటాయి.  కొంత కాలం తర్వాత ఆ భాగాలు అరిగిపోతాయి. అయితే, పుష్ స్టార్ట్, స్టాప్ బటన్ అనేది ఎలక్ట్రానిక్స్ ను ఉపయోగిస్తుంది. తక్కువ కదిలే భాగాలు ఉంటాయి. ఫిజికల్ స్ట్రెస్ కూడా తక్కువగా ఉంటుంది. చాలా కాలం ఎలాంటి సమస్య లేకుండా నడుస్తుంది.

 పుష్ స్టార్ట్, స్టాప్ ఫీచర్ తో నష్టాలు

Advertisement

పుష్ స్టార్ట్, స్టాప్ ఫీచర్ తో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. వాటిలో కామన్ సమస్య ఇంజిన్‌ ను ఆఫ్ చేయడం మర్చిపోవడం. ఇందులో ఆఫ్ చేయడానికి కీ ఉండదు కాబట్టి, తరచుగా చాలా మంది ఇంజిన్ ఆఫ్ చేయరు. కొంత మంది డ్రైవర్లు ఆరు ఆగిందని భావించి వెళ్లిపోతారు.  ముఖ్యంగా హైబ్రిడ్లలో ఈ సమస్య కామన్ గా ఎదురవుతుంది.

Read Also: హోండా To యమహా.. మహిళలకు సూటయ్యే బెస్ట్ స్కూటర్లు ఇవే!

Advertisement

ఇక స్మార్ట్ కీ ఫోబ్‌ అనేది చాలా ఖరీదైనది. దీనిని పోగొట్టుకుంటే, మళ్లీ కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది. ఒకవేళ ఈ కీ పోతే, డీలర్‌ దగ్గరికి వెళ్లి, రీప్రోగ్రామింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎక్కువగా డబ్బు ఖర్చవుతుంది. వారంటీ వ్యవధి ముగిసిన తర్వాత సిస్టమ్‌కు సంబంధించిన రిపేర్లు కూడా కాస్త ఖరీదుగా ఉంటాయి.  అయితే, కొన్నిసార్లు కారు బ్యాటరీ వీక్ అయినా, లేదంటే డెడ్ అయినా,  పుష్ స్టార్ట్ సిస్టమ్ పని చేయదు. చాలా కార్లకు బ్యాకప్ విధానం ఉంటుంది. కానీ, చాలా మంది యజమానులకు దాని గురించి తెలియదు. అత్యవసర సమయాల్లో కారు స్టార్ట్ కాకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Read Also:  పైలట్లు రొయ్యలు, పీతలు ఎందుకు తినరు? వారి క్యాప్‌ లో ఫొటోలు ఎందుకు పెట్టుకుంటారు?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×