OPPO Reno 15 Pro Mini Offers: హోలీ సంబరాలను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తమ వినియోగదారుల కోసం క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. Make Your Moment అనే కాన్సెప్ట్‌తో, పండుగ వేళ అపురూపమైన క్షణాలను తమ ఫోన్లలోని అద్భుతమైన పోర్ట్రెట్ కెమెరాలతో బంధించాలని కంపెనీ ఈ ప్రత్యేక ఆఫర్లను డిజైన్ చేసింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ మార్చి 8వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి డౌన్ పేమెంట్ పెద్ద భారంగా మారుతుంది. అయితే, ఈ హోలీ ఆఫర్లలో భాగంగా ఒప్పో తమ Reno, Find X9 సిరీస్ ఫోన్లపై జీరో డౌన్ పేమెంట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే.. ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించకుండానే కొత్త ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చన్నమాట. దీంతోపాటు వినియోగదారులపై వడ్డీ భారం పడకుండా 24 నెలల వరకు No cost EMI ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది.
Also Read: ఇది కలా.. నిజమా? అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3పై రూ.32,000 ఫ్లాట్ డిస్కౌంట్!
ఈ ఆఫర్లలో ప్రత్యేకంగా OPPO Reno 15 Pro Mini మోడల్‌పై గరిష్టంగా 24 నెలల పాటు వడ్డీ లేని వాయిదా పద్ధతిని పొందొచ్చు. అయితే, ఈ 24 నెలల జీరో డౌన్ పేమెంట్ స్కీమ్ కేవలం ఐసీసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు ద్వారా పేపర్ ఫైనాన్స్ చేసుకునే వారికే వర్తిస్తుంది. అలాగే ప్రీమియం మోడల్ అయిన Find X9పై 18 నెలల వరకు, రెనో 15 సిరీస్‌పై 15 నెలల వరకు ఈఎంఐ సదుపాయం ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఉన్న ఒప్పో A6, A6 ప్రో మోడళ్లపై కూడా 6 నుంచి 8 నెలల వరకు EMI ఆప్షన్స్ ఉన్నాయి.
కేవలం ఈఎంఐ మాత్రమే కాకుండా.. యూజర్లు అదనపు లాభాలు పొందాలని ఒప్పో క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై గరిష్టంగా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్ ఈఎంఐ, నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ రెండింటికీ వర్తిస్తుంది. మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో UPI ద్వారా పేమెంట్ చేసే వారికి కూడా 10 శాతం క్యాష్‌బ్యాక్ అందించడం విశేషం.
Also Read: 2.5K డిస్‌ప్లే, 6400mAh బ్యాటరీతో హువావే మేట్‌ప్యాడ్ మినీ.. ధర, పూర్తి వివరాలు ఇవే!