NoiseFit Diva Araya: ప్రముఖ బ్రాండ్ నాయిస్ మగువల కోసం ఒక అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని పేరు ‘నాయిస్‌ఫిట్ దివా అరాన్యా’. ఇది చూడటానికి కేవలం ఒక వాచ్‌లా కాకుండా.. చేతికి పెట్టుకునే అందమైన ఆభరణంలా కనిపిస్తోంది. టెక్నాలజీని, ఫ్యాషన్‌ను కలిపి నాయిస్ ఈ వాచ్‌ను చాలా రిచ్‌గా డిజైన్ చేసింది. ముఖ్యంగా స్టైలిష్‌గా ఉండాలనుకునే మహిళలకు ఈ వాచ్ పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది.
ఈ వాచ్‌ను చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే.. దీని సిరామిక్ బాడీ. నాయిస్ నుంచి వస్తున్న మొదటి సిరామిక్ వాచ్ ఇదే కావడం విశేషం. గీతలు పడని మెటీరియల్‌తో దీన్ని తయారు చేయడం వల్ల ఎప్పుడూ కొత్తదానిలా మెరుస్తూనే ఉంటుంది. దీనికి అదనపు హంగులు అద్దడానికి చుట్టూ 60 మెరిసే రాళ్లను అమర్చారు. అందుకే ఇది పార్టీలకు వెళ్లినప్పుడు చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. మీ డ్రెస్‌కు తగ్గట్టుగా సిరామిక్, మెటల్ లేదా మెష్ స్ట్రాప్స్‌ను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
స్క్రీన్ విషయానికి వస్తే.. ఈ వాచ్‌లో 1.28 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. దీని బ్రైట్‌నెస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎండలో బయటకు వెళ్లినా అక్షరాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. అలాగే దీనిలో ఉన్న బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో ఫోన్ తీయకుండానే వాచ్ నుంచే మాట్లాడేయొచ్చు. మీకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి వందకు పైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఇక రోజువారీ పనుల కోసం వాయిస్ అసిస్టెంట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
కేవలం అందం మాత్రమే కాదు.. ఈ వాచ్ ఆరోగ్యం విషయంలో కూడా కేర్ తీసుకుంటుంది. ఆడవారి కోసం ప్రత్యేకంగా పీరియడ్ సైకిల్ ట్రాకింగ్, రాత్రిపూట స్కిన్ టెంపరేచర్‌ను చెక్ చేసే ఫీచర్లు దీనిలో ఉన్నాయి. హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్ వంటివి కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, అత్యవసర సమయాల్లో మన లొకేషన్‌ను ఇతరులకు షేర్ చేసే SOS ఫీచర్ ఉండటం మహిళల భద్రతకు ఎంతో మేలు చేస్తుంది.
ఈ వాచ్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు ఐదు రోజుల పాటు పనిచేస్తుంది. ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న ఈ వాచ్ ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంది. ప్రారంభ ఆఫర్ కింద దీనిని కేవలం రూ.4,999కే సొంతం చేసుకోవచ్చు. మీక్కూడా ఈ రాయల్ లుక్ ఉన్న వాచ్ కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా నాయిస్ వెబ్‌సైట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు.
Also Read: 144Hz డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ సెన్సార్‌తో రానున్న Vivo X500 సిరీస్.. ఫీచర్లు అదరహో!