Chahal-Preity Zinta : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో సగం మ్యాచులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పాయింట్ల పట్టికలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంది పంజాబ్ కింగ్స్. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా సోషల్ మీడియాలో చిట్ చాట్ చేశారు. అయితే ఇందులో పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) కూడా పాల్గొన్నాడు. తనను పంజాబ్ కింగ్స్ ఓపెనర్ గా పంపించండి.. అంటూ పోస్ట్ పెట్టాడు చాహల్. దీనికి ప్రీతి జింటా అదిరిపోయే రిప్లై కూడా ఇచ్చింది. ఐపీఎల్ 2026 ఫినిష్ అయిన తర్వాత ఆ ప్లాన్ చేస్తానని భరోసా కూడా కల్పించింది ప్రీతి జింటా. దీంతో వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ వైరల్ గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా. పంజాబ్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే తనను నేరుగా అడగవచ్చని సోషల్ మీడియాలో చిట్ చాట్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో లైన్ లోకి పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వచ్చాడు. ఛాన్స్ ఉంటే తనను పంజాబ్ కింగ్స్ ఓపెనర్ గా బరిలోకి దింపాలని రిక్వెస్ట్ చేశాడు. ఛాన్స్ ఉంటే మాత్రం కచ్చితంగా తనను ఓపెనర్ గా పంపించాల్సిందేనని తెలిపాడు.
అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన కామెంట్ కు వెంటనే ప్రీతి జింటా రిప్లై ఇచ్చారు. చాహల్ నువ్వు అడిగింది నేను చేస్తాను.. కానీ దానికి సమయం అంటూ ఉంటుంది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఫినిష్ కాగానే ఓ ప్రత్యేక మ్యాచ్ నిర్వహించి నిన్ను ఓపెనర్ గా పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికైతే ప్రభ్ సిమ్రాన్ సింగ్ ( Prabh Simran Singh ) అలాగే ప్రియాంష్ ఆర్యను ఓపెనర్ గా వెళ్ళనివ్వు.. పంజాబ్ కింగ్స్ ఛాంపియన్ అయ్యేలా కృషి చెయ్.. వికెట్లు తీయడంపై దృష్టి పెట్టు అంటూ సూచనలు చేశారు ప్రీతి జింటా.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పైన కూడా తాజాగా ప్రీతి జింటా ప్రశంసలు కురిపించారు. అతడు స్ఫూర్తిదాయకమైన నాయకుడని… ప్రశాంతంగా ఉంటాడని వెల్లడించారు. పిల్లలతోనూ కూడా అద్భుతంగా వ్యవహరిస్తాడని వ్యాఖ్యానించారు. అందుకే తన పిల్లలు శ్రేయస్ భయ్యా అని పిలుస్తారని ప్రీతి జింటా తెలిపారు. ఆయనను ఎంతో ఇష్టపడతారని కూడా వ్యాఖ్యానించారు.
For sure Yuzi ❤️ Anything for you. IPL Khatam hone do, uske baad whichever match you like 😂I’m sure Prabh & Priyansh won’t mind then 🤩😂 #Ting
— Preity G Zinta (@realpreityzinta) April 27, 2026