E-Paper
Advertisement

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!
Advertisement

Nokia 300 4G Power Bank: స్మార్ట్‌ఫోన్ల యుగంలోనూ బటన్ ఫోన్లకు ఉండే డిమాండే వేరు. భారీ బ్యాటరీ లైఫ్, రఫ్‌ అండ్ టఫ్‌గా ఉండే ఫోన్ల కోసం ఇప్పటికీ చాలామంది వెతుకుతుంటారు. అలాంటి వారి కోసమే HMD గ్లోబల్ తాజాగా Nokia 300 4G Power Bank పేరుతో ఒక సరికొత్త ఫీచర్ ఫోన్‌ను పరిచయం చేసింది.

బ్యాటరీయే దీని ప్రధాన బలం:

ఈ ఫోన్‌లో అత్యంత ప్రత్యేకమైనది దీని 3,700mAh బ్యాటరీ. సాధారణ ఫీచర్ ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ చూడటం చాలా అరుదు. ఇది ఏకంగా 45 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను ఇస్తుంది. అంతేకాకుండా.. దీనిలోని రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా ఒక సైడ్ బటన్ నొక్కి ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా వాడుకోవచ్చు. బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌ల్లాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్లను దీనితో ఛార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: 8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

రఫ్ అండ్ టఫ్‌గా వాడేయొచ్చు:

సాధారణ ఫోన్లతో పోలిస్తే.. ఐదు రెట్లు ఎక్కువ వెలుతురు ఇచ్చే పవర్‌ఫుల్ టార్చ్‌ను ఇందులో అందించారు. ఇది ఐఫోన్ 16 ప్రో ఫ్లాష్ కంటే రెట్టింపు వెలుగునిస్తుంది. ఇక అవుట్‌డోర్ ట్రిప్స్, ప్రయాణాలు చేసే వారికి అనువుగా ఉండేలా ఈ ఫోన్‌కు IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు. కాబట్టి.. నీటి చినుకులు, ధూళి పడినా ఫోన్‌కు ఏమీ కాదు.

చిన్న డిస్‌ప్లే.. దానికి తగ్గ ఫీచర్లు:

Advertisement

ఇందులో 2.4 ఇంచుల చిన్న డిస్‌ప్లే, 0.3 మెగాపిక్సెల్ కెమెరా, FM రేడియో, 32GB వరకు పెంచుకోగల మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి. 4G సపోర్ట్ చేసే ఈ ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి ఈ ఫోన్ చాలా అనువుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ధర ఎంతంటే?

ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.2,700 మాత్రమే. బ్లాక్, గ్రీన్, గోల్డ్ కలర్లలో లభించే ఈ ఫోన్ త్వరలోనే ఇతర దేశాల్లోనూ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాకప్ ఫోన్ కావాలనుకునే వాళ్లు ఈ ఫోన్‌ను కళ్లు మూసుకుని కొనుగోలు చేయొచ్చు.

Also Read: జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

Related News

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

Big Stories

Advertisement
×