Nothing Ear 3 Pro teaser: విభిన్నమైన డిజైన్లు,సరి కొత్త మార్కెటింగ్ వ్యూహాలతో.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే నథింగ్ సంస్థ..మరో సారి టెక్ లవర్స్ మదిని దోచుకునేందుకు సిద్ధమైంది. తాజాగా ఆ కంపెనీ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన.. ఒక విచిత్రమైన టీజర్ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. పోకెమాన్ యూనివర్స్‌లోని.. వాటర్-డ్రాగన్ క్యారెక్టర్ అయిన ‘కింగ్ద్రా’బొమ్మను నథింగ్ తమ సిగ్నేచర్ డాట్-ఫాంట్ స్టైల్‌లో షేర్ చేసింది.ఈ చిన్న హింట్ చాలు.. రాబోయే కొత్త ఆడియో డివైజ్ గురించి టెక్ మార్కెట్‌లో చర్చ జరగడానికి!
నథింగ్ కంపెనీ తమ కొత్త గాడ్జెట్స్‌ను అభివృద్ది చేసే సమయంలో.. పోకెమాన్ పేర్లను సీక్రెట్ కోడ్‌నేమ్స్‌గా వాడటం ఆనవాయితీగా.. వస్తోంది. గతంలోనూ.. చాలా ప్రొడక్ట్స్‌కు ఇలాగే పేర్లు పెట్టారు.అయితే..కొద్ది రోజుల క్రితం నథింగ్ అధి కారిక వెబ్‌సైట్‌లో.. ‘నథింగ్ ఇయర్ (3) ప్రో’ అనే పేరుతో పాటు ‘కింగ్ద్రా’ కోడ్‌నేమ్ ఉన్న సపోర్ట్ పేజ్ పొరపాటున.. ఆన్ లైన్‌లో ప్రత్యక్షమైంది. క్షణాల్లోనే.. ఆ పేజీని తొలగించినప్పటికీ, అప్పటికే.. టెక్ బ్లాగర్లు దాని స్క్రీన్‌షాట్లను వైరల్ చేశారు. ఇప్పుడు కంపెనీ అధికారికంగా అదే కోడ్‌నేమ్‌తో టీజర్ వదలడంతో ఈ ఇయర్ బడ్స్ లాంచ్ త్వరలోనే ఉండబోతోందని క్లారిటీ వచ్చేసింది.
ఇంతకు ముందు నథింగ్ కంపెనీ ..‘ఇయర్’, ‘ఇయర్ (a)’ మోడల్స్‌ను మాత్రమే.. మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.అయితే.. ఆపిల్, శామ్‌సంగ్, సోనీ వంటి దిగ్గజ బ్రాండ్ల ప్రీమియం ‘ప్రో’ ఇయర్ బడ్స్‌కు గట్టి పోటీ ఇచ్చేలా, కంపెనీ మొట్ట మొదటి సారిగా ‘ప్రో’ ట్యాగ్‌తో ఈ డివైజ్‌ను తీసుకొస్తోంది. స్టాండర్డ్ మోడల్స్‌తో పోలిస్తే.. ఇందులో అడ్వాన్స్‌డ్ ఆడియో డ్రైవర్లు, మరింత పవర్ ఫుల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, అద్భుతమైన బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఉండేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ట్రాన్స్‌పరెంట్ డిజైన్: నథింగ్ బ్రాండ్‌కు ప్రధాన హైలైట్ అయిన.. పారదర్శకమైన లుక్, ఈ ప్రో మోడల్‌లో మరింత ప్రీమియంగా ఉండనుంది.
నాయిస్ క్యాన్సలేషన్: హై-ఎండ్ ఏఐ ఆధారిత అడాప్టివ్ ANC టెక్నాలజీతో.. రానుందని సమాచారం.ఇది బయటి శబ్దాలను పూర్తిగా అణచివేసి, క్రిస్టల్ క్లియర్ మ్యూజిక్ ఫీల్ ఇస్తుంది.
బ్యాటరీ,ఛార్జింగ్: సింగిల్ చార్జ్‌తో.. ఎక్కువ గంటల పాటు ప్లేటైమ్ ఇచ్చే బ్యాటరీతో పాటు, ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
Also Read: రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. నథింగ్ ఇయర్ ప్రో ధర సుమారు రూ.12,000 నుంచి రూ. 15,000 మధ్య ఉండే ఛాన్స్ ఉంది. ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. ఆడియో లవర్స్‌ను ఇది ఎంత గానో ఆకట్టుకుంటుంది. అతి త్వరలోనే ఈ గాడ్జెట్ లాంచ్ డేట్,పూర్తి స్పెసిఫికేషన్లను నథింగ్ అధికారికంగా ప్రకటించనుంది.
టెక్ మార్కెట్‌లో తనకంటూ .. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నథింగ్.. నుంచి వస్తున్న ఈ ఫస్ట్ ప్రో ఇయర్ బడ్స్ అంచనాలను తలకిందులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మీరు కూడా కొత్తగా వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనాలని ప్లాన్ చేస్తుంటే,ఈ నథింగ్ ఇయర్ (3) ప్రో కోసం మరో కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది!