E-Paper
Advertisement

విమానాల్లో ఫైవ్ స్టార్ రేంజ్ ఫుడ్.. ఎయిర్ ఇండియా క్రేజీ ప్లాన్!

విమానాల్లో ఫైవ్ స్టార్ రేంజ్ ఫుడ్.. ఎయిర్ ఇండియా క్రేజీ ప్లాన్!
Advertisement

Air India Fine Dining Service: ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు మరింత విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు సరికొత్త సర్వీసులను ప్రారంభించింది. సుదూర, అతి సుదూర విమానాల్లో ప్రత్యేకమైన ఫైన్ డైనింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులకు పలు రకాల వంటకాలతో కూడిన భోజనాన్ని అందించనుంది. తొలుత భారత్‌-యూకే మధ్య నడిచే కొన్ని అంతర్జాతీయ విమానాల్లో ఈ సేవను ప్రారంభించింది. విమాన ప్రయాణంలో ఫుడ్ క్వాలిటీని మెరుగుపరచడంతో పాటు, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు అదిరిపోయే ఎక్స్ పీరియెన్స్ ను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

భారత్‌-యూకే విమానాల్లో కొత్త సర్వీసులు

ఎయిర్ ఇండియా ఈ ఫైన్ డైనింగ్ సర్వీసులను తొలుత యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లే విమానాల్లో ప్రారంభించింది. లండన్ హీత్రూ, గాట్విక్, బర్మింగ్‌ హామ్ లాంటి నగరాలకు నడిచే విమానాల్లో ఈ సదుపాయాన్ని అందిస్తోంది. సుదూర ప్రయాణాల్లో ఎక్కువ సమయం విమానంలో గడిపే ప్రయాణికులకు భోజనం విషయంలో మరింత మంచి ఎక్స్ పీరియెన్స్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ విమాన భోజనానికి భిన్నంగా, వివిధ రకాల వంటకాలతో కూడిన ప్రత్యేక మెనూను అందించడం ఈ సర్వీసులు కీలక అంశం.

ఇతర అంతర్జాతీయ మార్గాలకూ విస్తరణ

Advertisement

ప్రస్తుతం కొన్ని భారత్‌-యూకే మార్గాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులను రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ మార్గాలకు విస్తరించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. ఇందుకోసం ఎయిర్‌బస్ A350, బోయింగ్ 787-9, బోయింగ్ 777-300 లాంటి విమానాలను ఉపయోగించనుంది. ఈ విమానాలు సుదూర ప్రయాణాలకు కీలకంగా ఉండటంతో, వాటిలో ప్రయాణికులకు అందించే సర్వీసులను మరింత మెరుగుపరచాలని సంస్థ భావిస్తోంది. అయితే, ఇతర మార్గాల్లో ఈ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే విషయంపై త్వరలో కంపెనీ క్లారిటీ ఇవ్వనుంది.

బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు

విమాన ప్రయాణంలో సౌకర్యవంతమైన సీట్లు, పర్సనలైజ్ సర్వీసులతో పాటు నాణ్యమైన భోజనం కూడా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఎక్కువ గంటలు ప్రయాణించే వారికి ఫుడ్ క్వాలిటీ ప్రయాణ అనుభవంపై ప్రభావం చూపుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ ఇండియా తన బిజినెస్ క్లాస్ సర్వీసులను మరో లెవల్ కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఫైన్ డైనింగ్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన ఫుడ్ ఎక్స్ పీరియెన్స్ అందించడంతో పాటు, అంతర్జాతీయ విమానయాన సంస్థలతో పోటీపడేందుకు కూడా ఎయిర్ ఇండియా సిద్ధమవుతోంది.

అంతర్జాతీయ విమానయాన రంగంలో పోటీ

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విమానయాన సంస్థలు బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన ఫుడ్ సర్వీసులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కూడా తన సర్వీసులను ఆధునీకరించడంపై దృష్టి పెట్టింది. కొత్త ఫైన్ డైనింగ్ సర్వీసులు ప్రయాణికులకు మంచి ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తాయని సంస్థ భావిస్తోంది. ఈ సేవలను మరిన్ని మార్గాలకు విస్తరిస్తే, అంతర్జాతీయ ప్రయాణికులకు మంచి ఫుడ్ ఎక్స్ ఫీరియెన్స్ లభించే అవకాశం ఉంది. విమాన ప్రయాణంలో నాణ్యమైన సేవలను అందిస్తూ.. తన బ్రాండ్‌ ను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఎయిర్ ఇండియా ముందుకెళ్తోంది.

Read Also: సౌదీలో క్షిపణి దాడులు.. భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరికలు!

Tags

Related News

ట్రాఫిక్‌లో చిక్కుకొని రైలు మిస్ అవుతుందని టెన్షన్ వద్దు.. మీ సమస్యకు పరిష్కారం ఇదే

ఇండియాను చూసేందుకు ఉద్యోగాలు వదిలేసిన యూరప్ అమ్మాయిలు.. వందే భారత్ జర్నీ చూసి..

సౌదీలో క్షిపణి దాడులు.. భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరికలు!

రైల్లో క్యాన్సర్ పేషెంట్ మృతి.. 12 గంటల పాటు మృతదేహంతో ప్రయాణికుల అవస్థలు!

గోల్డెన్ చారియట్ రైలులో తక్కువ ధరకే ప్రయాణం? ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్!

ఢిల్లీలో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి ఆ వెహికల్స్ కు నో ఎంట్రీ!

లోకో పైలట్లకు జీరో ఆల్కహాల్ రూల్.. రైల్వే బోర్డు షాకింగ్ డెసిషన్!

Big Stories

Advertisement
×