E-Paper
Advertisement

Nothing Phone 3a Lite 5G: సేల్ మొదలైంది మావా.. ఆరేళ్ల అప్డేట్స్‌తో సరసమైన ధరకే నథింగ్‌ 5G స్మార్ట్‌ఫోన్!

Nothing Phone 3a Lite 5G: సేల్ మొదలైంది మావా.. ఆరేళ్ల అప్డేట్స్‌తో సరసమైన ధరకే నథింగ్‌ 5G స్మార్ట్‌ఫోన్!
Advertisement

Nothing Phone 3a Lite 5G: భారత మార్కెట్లోకి నథింగ్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ ఇటీవలే విడుదలైంది. Nothing Phone 3a Lite 5G పేరు మీదగా మార్కెట్లోకి వచ్చిన ఈ హ్యాండ్‌ సెట్‌ను నథింగ్ ఫోన్ 3 సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చారు. గ్లిఫ్‌ లైట్‌, అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ చిప్‌సెట్‌, 50MP కెమెరాను కలిగి ఉన్న ఈ ఫోన్‌పై సేల్ ప్రారంభమైంది. ఏరేళ్ల వరకు అప్డేట్స్‌ను పొందే నథింగ్ ఫోన్ 3a లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా సహా ప్రముఖ రిటైల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

తొలి సేల్ షురూ:

ఈ నథింగ్‌ ఫోన్‌ 3a లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌‌ 8GB RAM + 128GB స్టోరేజీ ధర రూ.20,999 కాగా 8GB RAM + 256GB స్టోరేజీ ధర రూ.22999గా ఉంది. అయితే తొలి సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఐసిఐసిఐ, వన్‌కార్డ్ వంటి కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే, రూ.1000 డిస్కౌంట్‌ ను పొందొచ్చు. వైట్‌, బ్లూ, బ్లాక్‌ కలర్ వేరియంట్స్‌‌లో లభించే ఈ ఫోన్ IP54 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌‌గా వస్తుంది.

Advertisement

Also Read: గేమింగ్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్.. స్మాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌‌తో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

ఆరేళ్ల వరకు అప్డేట్స్:

నథింగ్ 5జీ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌‌తో 6.77 అంగుళాల ఫుల్‌ HD+ ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని డిస్‌ప్లే 3000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 387 PPI పిక్సల్‌ డెన్సిటి, 2160Hz PWM డిమ్మింగ్‌‌, పాండ గ్లాస్‌ ప్రొటెక్షన్‌‌తో లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత నథింగ్ OS 3.5 పైన పనిచేస్తుంది. మూడు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌‌ను అందిస్తుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్:

Advertisement

ఇక కెమెరా పరంగా చూసుకుంటే.. ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌‌ను కలిగి ఉండి, ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌, ఎలక్ట్రానిక్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్ లెన్స్‌ కూడా దీనిలో ఉంది. ఇకపోతే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16MP కెమెరాను అమర్చారు.

రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్:

ఈ హ్యాండ్ సెట్ కెమెరా విభాగం నైట్‌ మోడ్‌, మోషన్‌ క్యాప్చర్‌, మైక్రో మోడ్‌, ఆటో ట్యూన్‌, పొర్ట్రెయిట్ మోడ్‌, అల్ట్రా XDR ఫొటోస్‌ వంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఇది 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది.

Also Read: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు మావా.. అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×