E-Paper
Advertisement

Smartphone Comparison: నథింగ్ ఫోన్ 3a లైట్ vs శాంసంగ్ గెలాక్సీ A17 vs ఐకూ Z10R.. రూ.21000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: నథింగ్ ఫోన్ 3a లైట్ vs శాంసంగ్ గెలాక్సీ A17 vs ఐకూ Z10R.. రూ.21000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

Nothing Phone 3a Lite vs Galaxy A17 vs iQOO Z10R Comparison| ఇండియాలో తాజాగా విడుదలైన నథింగ్ ఫోన్ 3a లైట్ తక్కువ బడ్జెట్‌లో విడుదలైన ఫ్లాగ్‌షిప్ రేంజ్ ఫోన్. ఈ ఫోన్ పోటిగా తగిన ఫీచర్లు, అదే రేంజ్ ధరలో రెండు ఫోన్లు.. శాంసంగ్ గెలాక్సీ A17, ఐకూ Z10R ఉన్నాయి. ఈ మూడు ఫోన్లలో ఏది కొనుగోలు చేయాలో వాటి ఫీచర్లను పోల్చి చూద్దాం.

ధర ఎంత?

నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ధర 8GB+128GB వేరియంట్‌కి రూ.20,999, 8GB+256GB వేరియంట్‌కి రూ.22,999.
శాంసంగ్ గెలాక్సీ A17 5G ధర 8GB+128GB మోడల్ కలర్ వేరియంట్‌ని బట్టి రూ.19,499 నుంచి మొదలై రూ.20,999 వరకు ఉంటుంది.
ఐకూ Z10R 5G కూడా 8GB+128GB ధర రూ.19,499 ఉండగా.. 8GB+256GB వేరియంట్ ధర రూ.21,499కి దొరుకుతుంది.
మూడు ఫోన్ల ధరలు కూడా దాదాపు ఒకే రేంజ్‌లోనే ఉన్నాయి.

డిస్‌ప్లే ఎలా ఉంది?

Advertisement

నథింగ్ ఫోన్ 3a లైట్ లో 6.77 ఇంచ్ FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఎండలోనైనా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A17లో 6.7 ఇంచ్ Super AMOLED స్క్రీన్ ఉంది కానీ 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే.
ఐకూ Z10Rలో కూడా 6.77 ఇంచ్ FHD+ AMOLED ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. డిస్‌ప్లే క్వాలిటీలో Nothing ఫోన్ స్పష్టంగా ముందుంది.

సాఫ్ట్‌వేర్

నథింగ్ ఫోన్ 3a లైట్ లో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Nothing OS 3.5 ఉంటుంది. ఇది చాలా క్లీన్, స్మూత్ ఇంటర్‌ఫేస్ ఇస్తుంది. గెలాక్సీ A17లో One UI 7 (Android 15 బేస్) ఉంటుంది – స్టేబుల్ ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. ఐకూ Z10Rలో Funtouch OS 15 ఉంటుంది. కొంచెం బ్లోట్‌వేర్ ఉన్నా వేగంగా పనిచేస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

Advertisement

నథింగ్, శాంసంగ్ రెండింటిలో 5000mAh బ్యాటరీ ఉంది. నథింగ్ 33W, శాంసంగ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తాయి. ఐకూ Z10Rలో మాత్రం 5700mAh పెద్ద బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. స్మార్ట్‌ఫోన్ రోజూవారీ ఎక్కువగా ఉపయోగించే వాళ్లకు ఐకూ బెస్ట్ ఛాయిస్.

ప్రాసెసర్

నథింగ్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 Pro ప్రాసెసర్ చిప్ ఉంది. శాంసంగ్‌లో Exynos 1330, iQOOలో మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉన్నాయి. రోజువారీ ఉపయోగానికి మూడూ బాగానే పనిచేస్తాయి. హెవీ గేమింగ్‌కి ఐకూ, నథింగ్ కొంచెం బెటర్ ఆప్షన్స్.

కెమెరా ఎలా ఉంది?

నథింగ్ ఫోన్ 3a లైట్ లో 50MP మెయిన్ + 8MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో.. అంటే మూడు కెమెరాలు ఉన్నాయి. శాంసంగ్, iQOOలో 50MP మెయిన్ + 2MP మాత్రమే. అల్ట్రా-వైడ్ ఫోటోలు కావాలంటే Nothing మాత్రమే ఇస్తుంది.

ఏది బెస్ట్?

అద్భుతమైన డిస్‌ప్లే, క్లీన్ సాఫ్ట్‌వేర్, మంచి కెమెరా కావాలంటే నథింగ్ ఫోన్ 3a లైట్ లో కొనండి.
బ్రాండ్ ట్రస్ట్, ఎక్కువ సంవత్సరాల అప్‌డేట్స్ కావాలంటే శాంసంగ్ గెలాక్సీ A17 బెటర్ చాయిస్.
పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, గేమింగ్ కావాలంటే ఐకూ Z10R బెస్ట్.

మీ అవసరం, ప్రాధాన్యాలను బట్టి ఎంచుకోండి.

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×