E-Paper
Advertisement

Temples In India: పెళ్లి కావట్లేదని బాధపడుతున్నారా? ఈ ఆలయాలకు వెళ్లే మూడు ముళ్లు పడిపోతాయ్ అంతే!

Temples In India: పెళ్లి కావట్లేదని బాధపడుతున్నారా? ఈ ఆలయాలకు వెళ్లే మూడు ముళ్లు పడిపోతాయ్ అంతే!
Advertisement

భారతీయు సంప్రదాయంలో పెళ్లికి ఎంతో గౌరవం ఉంది. యుక్త వయసులో పెళ్లి అయితే, మంచిదని పెద్దలు భావిస్తారు. 25 ఏళ్లలో పెళ్లి చేసుకుంటే, పిల్లలు, సంసారం చక్కగా కొనసాగుతాయంటారు. అయితే, ఇప్పుడు చాలా మంది 30 ఏళ్లు దాటినా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. మరికొంత మందికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నా, సరైన సంబంధాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వివాహ అడ్డంకులు ఎదుర్కొనే వారు కొన్ని దేవాలయాలు వెళ్తే, వెంటనే కల్యాణ భాగ్యం కలుగుతుందంటున్నారు పండితులు. వీటిని దర్శించుకుని మొక్కుల చెల్లించుకుంటే, పెళ్లి సమస్యలను  తొలగిపోయి, త్వరగా వివాహం అవుతుందని నమ్ముతారు. ఇంతకీ ఆ ఆలయాలు ఏవంటే..

⦿ నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం, తమిళనాడు

ఈ ఆలయం చెన్నైకి సమీపంలో ఉంటుంది. నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం శతాబ్దాలుగా కల్యాణ యోగాన్ని కలిగించే ఆలయంగా గుర్తింపు పొందింది. సంప్రదాయం ప్రకారం, వరాహుడు(విష్ణువు అవతారం) ప్రతిరోజూ కాలవ ఋషి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. అందుకే నిత్యకల్యాణ పెరుమాళ్ అనే బిరుదును పొందాడు. పెళ్లి కాని వాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వారి కూడా పెళ్లి అవుతుందని నమ్ముతారు. పెళ్లి కాని యువ,తీ యువకులు ఈ ఆలయానికి వచ్చి జత దండలు సమర్పిస్తారు. ఒకటి స్వామివారికి వేస్తారు. మరొకటి భక్తులకు తిరిగి ఇస్తారు. వారు దాన్ని ధరించి ఆలయం చుట్టూ తిరగాలి. ఇలా చేయడం వల్ల వివాహ మార్గంలో అడ్డుగా నిలబడే కర్మ ముడులను, వ్యక్తిగత ఆందోళనలను చక్కదిద్దుతుందని నమ్ముతారు. ఆ తర్వాత పెళ్లి అవుతుందని భావిస్తారు.

⦿ తిరుమనంచేరి ఆలయం, తమిళనాడు

Advertisement

కుంభకోణం సమీపంలో కావేరి నది తీరంలోని ఉన్న తిరుమనంచేరిని ఆలయం చాలా కాలంగా వివాహాలు జరిపించే ఆలయంగా గుర్తింపు పొదింది. పురాణాల ప్రకారం, ఇక్కడే శివుడు, పార్వతి దేవి తిరిగి కలుసుకున్నారని చెప్తారు.  ఇది శాశ్వత భాగస్వామ్యానికి వేదికగా భావిస్తారు. కుటుంబ సమస్యలు ఉన్న జంటలు, పెళ్లి కాని వ్యక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే, దోషాలు తొలగిపోతాయని భావిస్తారు.

⦿ కాత్యాయనీ ఆలయం, ఢిల్లీ

దేశ రాజధానిలోని ఛతర్‌ పూర్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది. నవరాత్రి సమయంలో కాత్యాయనీ ఆలయానికి వేలాది మంది అవివాహిత యువతులు వచ్చి దర్శించుకుంటారు. ఈ సంప్రదాయం భాగవత పురాణం నుంచి ఉద్భవించిందని చెప్తారు. ఇక్కడ యువతులు ఆదర్శ భాగస్వామిని వెతుక్కుంటూ కాత్యాయనీ వ్రతం చేస్తారు. ఇక్కడ వ్రతం చేసిన అమ్మాయిలకు వీలైనంత త్వరగా పెళ్లి కుదురుతుందని భావిస్తారు.

⦿ శ్రీనివాస మంగాపురం ఆలయం, ఆంధ్రప్రదేశ్

Advertisement

తిరుపతి నుంచి కొద్ది దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. ఇక్కడ కొత్తగా వివాహమైన జీవితంతో ముడిపడి ఉన్న విష్ణువు స్వరూపం కల్యాణ వెంకటేశ్వరుడిగా కొలువుదీరింది. పెళ్లి తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు తన భార్యతో ఇక్కడే బస చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే, పెళ్లికాని యువతీ, యువకులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే, వారికి తగిన జీవిత భాగస్వామి దొరుకుతారని నమ్ముతారు.

⦿ శ్రీ కాళహస్తి ఆలయం, ఆంధ్రప్రదేశ్

భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన శైవ దేవాలయాలలో ఒకటైన శ్రీ కాళహస్తి.. రాహు-కేతు పూజకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జ్యోతిషశాస్త్ర అడ్డంకులను తగ్గించడానికి పూజలు నిర్వహిస్తారు. అనేక కుటుంబాలలో వచ్చే వైవాహిక సమస్యలను సమసిపోవడానికి ఈ ఆలయ దర్శనం కారణం అవుతందని చాలా మంది భావిస్తారు. ఈ ఆలయంలో రాహు, కేతువు పూజ చేసుకునే వారికి కల్యాణయోగం కలుగుతుందని నమ్ముతారు.

⦿ బర్సానా రాధా రాణి ఆలయం, ఉత్తరప్రదేశ్

బర్సానాలోని ఒక కొండపై ఉన్న ఈ రాధా దేవి ఆలయాన్ని దర్శించే భక్తులకు కూడా త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు.  దక్షిణాది దేవాలయాల మాదిరిగానే ఇది సాంప్రదాయకంగా వివాహ జాప్యాలను తొలగించడంలో సాయపడుతుందని భక్తులు విశ్వసిస్తారు. త్వరగా తమ వివాహం జరగాలని చాలా మంది యువతీ యువకులు ఇక్కడికి వచ్చి కోరుకుంటారు.

Read Also: 8 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం టోకన్లు, ఎలా పొందాలంటే?

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×