E-Paper
Advertisement

Smartphone Comparison: నథింగ్ ఫోన్ 4a vs ఒప్పో రెనో 15C vs వన్‌ప్లస్ నార్డ్ 5.. రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: నథింగ్ ఫోన్ 4a vs ఒప్పో రెనో 15C vs వన్‌ప్లస్ నార్డ్ 5.. రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Nothing Phone 4a vs Oppo Reno 15C vs OnePlus Nord 5 Smartphone Comparison| ప్రస్తుతం రూ. 40,000 లోపు బడ్జెట్‌లో మంచి స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో మూడు ఫోన్లు.. నథింగ్ ఫోన్ 4a, ఒప్పో రెనో 15C 5G, వన్‌ప్లస్ నార్డ్ 5 ప్రధానమైన పోటీదారులుగా నిలుస్తున్నాయి. ఈ మూడింటి లక్షణాలు, ధరల గురించి సరళంగా తెలుసుకుందాం.

ధర

నథింగ్ ఫోన్ 4a 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ. 31,999కి లభిస్తోంది. 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ. 34,999, 12GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ. 37,999.
ఒప్పో రెనో 15C 5G 8GB ర్యామ్ + 256GB మోడల్ ధర రూ. 37,999, 12GB ర్యామ్ + 256GB మోడల్ ధర రూ. 40,999.
వన్‌ప్లస్ నార్డ్ 5 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 33,999కు అందుబాటులో ఉంది. 12GB ర్యామ్ + 256GB వేరియంట్ రూ. 36,999 ధరలో ఉంది.

డిస్ప్లే ఎలా ఉంది?

నథింగ్ ఫోన్ 4a 6.78-అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఒప్పో రెనో 15C 5G 6.57-అంగుళాల AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో 6.83-అంగుళాల పెద్ద AMOLED డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

సాఫ్ట్‌వేర్ 

నథింగ్ ఫోన్ 4a ఆండ్రాయిడ్ 16, Nothing OS 4.1తో పనిచేస్తుంది. ఇది చాలా క్లీన్, సింపుల్ ఇంటర్ఫేస్ అందిస్తుంది. ఒప్పో రెనో 15C 5G ఆండ్రాయిడ్ 16, ColorOS 16తో రన్ అవుతుంది. ఇందులో చాలా కస్టమైజేషన్ ఆప్షన్లు ఉంటాయి. వన్‌ప్లస్ నార్డ్ 5 ఆండ్రాయిడ్ 15, OxygenOS 15తో పనిచేస్తూ స్మూత్ పర్‌ఫామెన్స్ అందిస్తుంది.

ప్రాసెసర్ పర్‌ఫామెన్స్

నథింగ్ ఫోన్ 4a స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది రోజువారీ పనులు, మోస్తరు గేమింగ్‌కు సరిపోతుంది. ఒప్పో రెనో 15C 5G స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది సాధారణ వాడకానికి అనుకూలం. వన్‌ప్లస్ నార్డ్ 5లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ఇది ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్‌ఫామెన్స్, స్మూత్ గేమింగ్ అందిస్తుంది.

కెమెరా

నథింగ్ ఫోన్ 4a వెనుకవైపు 50MP ప్రైమరీ, 50MP పెరిస్కోప్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒప్పో రెనో 15C 5Gలో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5లో 50MP ప్రైమరీ (OISతో), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా

నథింగ్ ఫోన్ 4a ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంది. ఒప్పో రెనో 15C 5Gలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. OnePlus నార్డ్ 5 కూడా 50MP సెల్ఫీ కెమెరానే అందిస్తుంది. ఒప్పో, OnePlus సెల్ఫీలు చాలా షార్ప్‌గా వస్తాయి.

Also Read:  ఏసి సర్వీస్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? క్లీనింగ్, గ్యాస్ ఫిల్లింగ్, రిపేర్ల కోసం ఎంత చెల్లించాలంటే

బ్యాటరీ, ఛార్జింగ్ కెపాసిటీ

నథింగ్ ఫోన్ 4a 5400mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఒప్పో రెనో 15C 5Gలో భారీ 7000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ ఉంది. OnePlus నార్డ్ 5 6800mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ అందిస్తుంది.

ఏ ఫోన్ బెస్ట్?

మీరు గేమింగ్, పవర్ యూజర్ అయితే OnePlus నార్డ్ 5 బెటర్ ఛాయిస్. చాలా సేపు ఫోన్ వినియోగించేవారికి ఒప్పో రెనో 15C 5G బ్యాటరీ బెస్ట్. క్లీన్ సాఫ్ట్‌వేర్, యూనిక్ డిజైన్ ఇష్టపడేవారికి నథింగ్ ఫోన్ 4a మంచి ఆప్షన్.

ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న స్మార్ట్ ఫోన్స్ ఫీచర్లు, ధరలు.. ఆయా కంపెనీలు ప్రకటించే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. మీరు జాగ్రత్తగా చెక్ చేసి కొనుగోలు కొనుగోలు చేయాలని సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో తెలిపిన ధరలు మారిపోయి ఉండవచ్చు. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×