E-Paper
Advertisement

Type C Rechargable Batteries: కొత్త రీఛార్జెబుల్ బ్యాటరీలు లాంచ్.. టైప్-C కేబుల్‌తోనే డైరెక్ట్ ఛార్జింగ్

Type C Rechargable Batteries: కొత్త రీఛార్జెబుల్ బ్యాటరీలు లాంచ్.. టైప్-C కేబుల్‌తోనే డైరెక్ట్ ఛార్జింగ్
Advertisement

Type C Rechargable Batteries| భారతదేశంలో పోర్ట్రానిక్స్ కంపెనీ కొత్త రీఛార్జబుల్ బ్యాటరీ సిరీస్‌ను విడుదల చేసింది. దీని పేరు లిథియస్ సెల్. ఇందులో AA, AAA సైజు బ్యాటరీలు ఉన్నాయి. ఈ బ్యాటరీల ప్రత్యేకత ఏంటంటే.. వాటిలోనే బిల్ట్-ఇన్ యుస్‌బి టైప్ సి (USB Type-C) పోర్ట్ ఉంది! అంటే ఛార్జర్ డాక్ వేరుగా అవసరం లేదు, సాధారణ మొబైల్ టైప్-C కేబుల్ పెట్టి డైరెక్ట్ ఛార్జ్ చేయొచ్చు.

ప్రధాన ఫీచర్ – బిల్ట్-ఇన్ టైప్-C పోర్ట్

బ్యాటరీలోనే చిన్న టైప్-C పోర్ట్ ఉంటుంది. మీ దగ్గరున్న ఏ టైప్-C కేబుల్ అయినా పెట్టి ఛార్జ్ చేయవచ్చు. ఇంకెక్కడా వేరే ఛార్జర్ కొనాల్సిన పని లేదు. అందుకే ఛార్జింగ్ చాలా సులభంగా, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది!

స్థిరమైన పవర్ – 1.5V ఎల్లప్పుడూ

Advertisement

ఈ బ్యాటరీలు ఎప్పుడూ 1.5 వోల్ట్ పవర్ ఇస్తాయి. టీవీ రిమోట్, వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్, గేమింగ్ కంట్రోలర్, గడియారం, బొమ్మలు.. ఏ పరికరంలో పెట్టినా స్థిరంగా పనిచేస్తాయి.

భద్రత, లీక్ లేని డిజైన్

బ్యాటరీ పగిలిపోవడం, లీక్ కావడం అసలు జరగదు. గట్టి షెల్ ఉండటంతో ఈ బ్యాటరీ చాలా సేఫ్. మీ ఇంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా సురక్షితంగానే ఉంటాయి.

5 – లెవెస్ భద్రతా వ్యవస్థ

  • షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్
  • ఎక్కువ వోల్టేజీ నుంచి రక్షణ
  • ఓవర్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్
  • టెంపరేచర్ కంట్రోల్
  • సర్జ్ ప్రొటెక్షన్
Advertisement

ఈ ఐదు లెవెల్స్ లో ప్రొటెక్షన్ ఉండడం వల్ల బ్యాటరీ చాలా కాలం డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

ఎక్కువ కాలం పవర్ ఉండే కెపాసిటీ

ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీలు చాలా రోజులు పనిచేస్తాయి. మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయాల్సిన ఇబ్బంది లేదు. ఒకేసారి వాడి పడేసే బ్యాటరీలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు, రీయుజేబుల్ కాబట్టి పర్యావరణానికి కూడా చాలా మంచిది.

సైజు, కెపాసిటీ

AAA బ్యాటరీ – 440mAh (666mWh). AA బ్యాటరీ – 1480mAh (2220mWh). మీ పరికరానికి తగిన బ్యాటరీ ఎంచుకోండి.

ధర ఎంతంటే?

AAA రెండు బ్యాటరీల సెట్ ధర రూ.499 మాత్రమే. AA రెండు బ్యాటరీల సెట్ – రూ.449 మాత్రమే. ఇంత తక్కువ ధరలో ఇంత మంచి రీఛార్జబుల్ బ్యాటరీలు దొరకడం చాలా విలువైన డీల్!

ఎక్కడ కొనాలి?

ప్రొట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి అన్ని పెద్ద ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తాయి. కొన్ని రిటైల్ షాపుల్లో కూడా దొరుకుతాయి.

ఎవరికి బెస్ట్ ఆప్షన్?

రోజూ ఎక్కువగా బ్యాటరీ పరికరాలు ఉపయోగించే వారికి, పర్యావరణాన్ని కాపాడాలనుకునే వారికి, టెక్ ప్రేమికులకు, ఇంట్లో చెత్త తగ్గించాలనుకునే వారికి ఈ కొత్త బ్యాటరీలు బెస్ట్.

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

 

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×