E-Paper
Advertisement

OTT Movie : కజిన్‌కి కన్నుకొట్టే అమ్మాయి… ప్రేమ పాఠాలు నేర్పిస్తూ అలాంటి పనులు… సింగిల్‌గా చూడాల్సిన మూవీ

OTT Movie :  కజిన్‌కి కన్నుకొట్టే అమ్మాయి… ప్రేమ పాఠాలు నేర్పిస్తూ అలాంటి పనులు… సింగిల్‌గా చూడాల్సిన మూవీ
Advertisement

OTT Movie : 1995లో వచ్చిన అమెరికన్ టీన్ కామెడీ కల్ట్ క్లాసిక్ గా ‘Clueless’ మూవీ గుర్తింపు తెచ్చుకుంది. అందులో నటించిన అలీషా సిల్వర్‌స్టోన్ ఒక్క సినిమాతోనే 90స్ కాలం నాటి టీన్ ఐకాన్ అయిపోయింది. ఇప్పటికీ యంగ్ జెనరేషన్ ఫాలో అయ్యే స్టైల్ ఇచ్చిన సినిమా. 12 మిలియన్ బడ్జెట్ తో 56 మిలియన్ వసూళ్లు చేసి కల్ట్ స్టేటస్ ని పొందింది. కజిన్ ని లవ్ చేసే ఒక అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఏమీ హెక్లింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘Clueless’ సినిమా 1995లో రిలీజ్ అయింది. ఇందులో అలీషా సిల్వర్‌స్టోన్ (చెర్), పాల్ రడ్ (జోష్) బ్రిటనీ మర్ఫీ (తై) లీడ్ రోల్స్ లో నటించారు. 1 గం 37 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.9/10 రేటింగ్ పొందింది. అమెజాన్ ప్రైమ్, jio Hotstar, నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బెవర్లీ హిల్స్‌లో ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయి చెర్ చూడటానికి బార్బీ డాల్ లా ఉంటుంది. ఆమె తండ్రి పెద్ద లాయర్. చెర్‌కి డియాన్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. ఇద్దరూ స్కూల్‌లో పాపులర్ గర్ల్స్. ఒక రోజు స్కూల్‌లో గజిబిజి దుస్తులు, నేర్డ్ లుక్ తో తై అనే ఒక కొత్త అమ్మాయి వస్తుంది. చెర్ అరె ఈ అమ్మాయిని మేకోవర్ చేయాల అని డిసైడ్ అవుతుంది. ఇద్దరూ తైని హెయిర్‌స్టైల్, మేకప్ చేసి సూపర్ హాట్ గా తయ్యారు చేస్తారు. చెర్ ఆ తర్వాత తైని ఒక బాయ్‌తో సెట్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ ప్లాన్ బ్యాక్‌ఫైర్ అయి తై ఇంకా పాపులర్ అయిపోతుంది. చెర్ కొంచెం జెలసీ ఫీల్ అవుతుంది.

Read Also : ఒంటరి అమ్మాయిని వెంటాడే దెయ్యం… పగలే చుక్కలు చూపిస్తూ… ఇది మామూలు స్టోరీ కాదయ్యో

Advertisement

ఇంతలో చెర్‌కి స్టెప్ బ్రదర్ జోష్ తో గొడవలు. జోష్ కాలేజీలో ఉంటాడు, చెర్‌ని టీజ్ చేస్తూనే ఉంటాడు. చెర్ మొదట క్రిస్టియన్ అనే గే బాయ్‌ని లైక్ చేసి ఫ్లర్ట్ చేస్తుంది. అతను గే అని తెలిసాక కొత్త బాయ్ ఎల్టన్ మీద కన్ను పడుతుంది. కానీ అతను తైని ఇష్టపడతాడు. చెర్ ఫుల్ గందరగోళంలో పడిపోతుంది. క్లైమాక్స్‌లో చెర్ ఒక్కసారిగా రియలైజ్ అవుతుంది. తను కజిన్ జోష్‌ని లవ్ చేస్తుంది. జోష్ కూడా ఆమెని లవ్ చేస్తాడు. ఇద్దరూ కలిసిపోతారు. ఇలా ఈ సినిమా ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×