Unlimited 5G Data Gift : ప్రియమైన వారికి గిఫ్ట్ ఇవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే గిఫ్ట్ లో వారిని సప్రైజ్ చేసే గిఫ్ట్స్ ఎన్నో. అందులో రోజూ వినియోగించే వస్తువుల్ని గిఫ్ట్ గా ఇస్తే ఎదుటివారి కళ్ళల్లో ఉండే ఆనందమే వేరు. అయితే ఇకపై మీరూ కూడా ఇష్టమైనవారికి అలాంటి గిఫ్ట్ ఇచ్చేయొచ్చు. ఎందుకంటే జియో 12 నెలల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ 5G డేటాను అతి తక్కువ ధరకే తీసుకొచ్చేసింది. దీన్ని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.
ప్రముఖ టెలికాం సంస్థ జియో.. తాజాగా 12 నెలల వ్యాలిడిటీతో అపరిమిత 5G డేటాతో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అయితే దీన్ని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. మీ ప్రియమైన వాళ్లు ఎక్కువగా డేటా ఉపయోగించే వారైనా లేదా హై స్పీడ్ డేటా అవసరమైన వారైనా కచ్చితంగా ఈ గిఫ్ట్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
జియో అన్లిమిటెడ్ 5G ప్లాన్ పేరుతో వచ్చేసిన ఈ డేటా ప్లాన్ వాలిడిటీ 12 నెలల పాటు ఉంటుంది. అయితే ఏడాదిపాటు సాగే ఈ ప్లాన్ ను ఎవరైతే వినియోగించాలి అనుకుంటున్నారో వారు రోజు కనీసం 2జీబి డేటా ప్లాన్ తో ఫోన్ ను రీఛార్జ్ చేసుకోవాలి. ఆపై బేస్ ప్లాన్ తో ఈ ప్లాన్ ను ఉపయోగించే అవకాశం ఉంటుంది.
ప్లాన్ విషయానికొస్తే, ఈ ప్లాన్ ధర రూ. 601గా ఉంది. ఇక Google Play Store, Apple App Store రెండింటిలోనూ అందుబాటులో ఉన్న MyJio అప్లికేషన్ ద్వారా కొనుగోలుదారులు 12 అపరిమిత 5G అప్‌గ్రేడ్ వోచర్‌లను పొందే ఛాన్స్ ఉంటుంది. అపరిమిత 5G వోచర్‌ను యాక్టివేట్ చేయడానికి, వినియోగదారులు నెలవారీ, త్రైమాసిక బేస్ ప్లాన్‌ను పొందాల్సి ఉంటుంది. అలాగే రోజుకు 2 GB డేటా నుండి రోజుకు 4 GB డేటా ఉపయోగించే యూజర్స్ కు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అయితే రోజుకు 1GB డేటా ప్లాన్‌ని ఎంచుకున్న వినియోగదారులందరికీ లేదా Jio రూ. 1,899 ప్లాన్‌ని ఎంచుకున్న వినియోగదారులందరికీ ఈ వోచర్ చెల్లుబాటు కాదు.
Jio వినియోగదారులందరూ తమ కోసం వోచర్లను కొనుగోలు చేయవచ్చు లేదా MyJio అప్లికేషన్ ద్వారా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. వినియోగదారులు తెలుసుకోవలసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, వోచర్‌ను బహుమతిగా ఇచ్చే ముందు, రిసీవర్ అర్హత గల ప్లాన్‌లో ఉన్నారని నిర్ధారించుకోండి.
జియో అపరిమిత 5G డేటా వోచర్‌ల విషయానికొస్తే, రూ. 199, రూ. 239, రూ. 299, రూ. 319, రూ. 329, రూ. 579, రూ. 666, రూ. 769, రూ. 899తో పాటు మరికొన్ని రీఛార్జ్ ప్లాన్‌లతో అవి వర్క్ అవుతున్నాయి. అపరిమిత 5G ప్లాన్ చెల్లుబాటు 30 రోజుల గరిష్ట వాలిడిటీ పరిమితితో బేస్ ప్లాన్ చెల్లుబాటుకు సమానంగా ఉంటుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం.. అతి తక్కువ ధరకే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ను మీ ఫ్రెండ్స్ కు గిఫ్ట్ ఇచ్చేయాలంటే కచ్చితంగా ఈ ప్లాన్ ను ట్రై చేసేయండి.
ALSO READ : యాపిల్ కొత్త ఐపాడ్.. తక్కువ ధరకే ఇంటిలిజెన్స్ ఫీచర్స్ తో!