BigTV English

పాక్ vs అఫ్ఘాన్ – స్నేహితులు.. శత్రువులు ఎలా అయ్యారు? మరో యుద్ధం తప్పదా?

పాక్ vs అఫ్ఘాన్ – స్నేహితులు.. శత్రువులు ఎలా అయ్యారు? మరో యుద్ధం తప్పదా?

Pakistan on Afganistan : పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు(Air Stricks) చేసిన ఘటన ఇప్పటికీ చాలా మందికి గుర్తే ఉంటుంది. సరిగా అలాంటి దాడులే ఇప్పుడు పాకిస్థాన్ చేసింది. అయితే.. ఈ దాడులు దాని సరిహద్దు దేశం, ఇప్పటి వరకు మిత్ర దేశంగా ఉన్న అఫ్ఘనిస్థాన్ లోని ప్రాంతాలపై. దీంతో.. ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది అంటూ అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే.. అనేక దేశాల మధ్య యుద్ధంతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. తాజాగా పాక్ – అఫ్ఘాన్ (Pak_Afghan) మధ్య దాడులతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.


తాలిబన్ పాలనలోని అప్ఘనిస్థాన్ పై డిసెంబర్ 24 అర్థరాత్రి వేళ యుద్ధ విమానాలు(Fighter Jets) బాంబులతో విరుచుకుపడ్డాయి. పాకిస్థాన్ కు సరిహద్దుగా ఉన్న దాదాపు 7 గ్రామాల్లోని నివాసాలపై బాంబు దాడులు జరిగినట్లు.. అప్ఘన్ తాలిబన్లు(Taliban Govt) ప్రకటించారు. ఇందులో 15 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్థరించారు. మరికొంత మంది తీవ్రంగా గాయాల పాలైయ్యారు. వీరిని ఆసుపత్రులకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కాగా.. దాడుల్లో మొత్తంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

అప్ఘనిస్థాన్ లోని పాక్‌టీకా (Paktika) రాష్ట్రం బర్మాల్ జిల్లాలో ఈ బాంబు దాడులు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ కి సరిహద్దును పంచుకుంటున్న ఈ ప్రాంతంలోని ఏడు గ్రామాలు బాంబు దాడులకు గురికాగా.. అందులోని లామాన్ (laman) గ్రామంలో ఎక్కువ మంది చనిపోయారు. ఈగ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.


నివాసాల మధ్య బాంబు దాడులు జరగడంతో.. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. వాటిని తొలగిస్తే.. మరింత మంది మృతులు బయటపడే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. అర్థరాత్రి వేళ పాకిస్థాన్ యుద్ధ విమానాలు అటుగా వచ్చినట్లు ఈ గ్రామస్థులు చెబుతున్నారు. పాకిస్థాన్ సైన్యమే బాంబు దాడులు చేసిందని ఆరోపిస్తున్నారు.

తాలిబన్ ప్రభుత్వం సీరియస్..

ఈ దాడులపై తాలిబన్ ప్రభుత్వం (Taliban Govt) స్పందించింది. బాంబు దాడుల్ని ఖండించిన తాలిబన్లు.. తమ దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. తమ దేశాన్ని కాపాడుకునే హక్కు, అధికారం తమకున్నాయన్న ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి (Foreign affairs minister).. త్వరలోనే దాడులకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

ఈ బాంబు దాడిలో ఎక్కువగా మహిళలు(Women), పిల్లలు(Child), పౌరులే(Citizens) గాయపడ్డారని తెలిపింది. బాధితుల్లో ఎక్కువ మంది వజీరిస్థాన్ ప్రాంతానికి చెందిన శరణార్థులేనని తెలిపింది. ఈ దాడుల్ని క్రూరమైన చర్యగా అభివర్ణించిన అఫ్గాన్ తాలిబన్లు.. ఇటువంటి ఏకపక్ష చర్యలతో సమస్యలకు పరిష్కారం కనుక్కోలేరంటూ పేర్కొంది. ఈ దాడుల్ని పిరికి పంద చర్యలన్న అఫ్గాన్ ప్రభుత్వం.. ఇస్లామిక్ ఎమిరేట్ వీటికి సమాధానం ఇవ్వకుండా వదిలివేయదని హెచ్చరించింది.

పాకిస్థాన్ రక్షణ రంగ నిపుణులు ఏం చెబుతున్నారు..

ఇస్లామాబాద్‌కు (Islamabad) చెందిన భద్రతా నిపుణుడు సయ్యద్ ముహమ్మద్ అలీ.. ఈ ఘటనపై స్పందించారు. వైమానిక దాడి పాకిస్థానీ తన సరిహద్దుల లోపల, బయట ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలైనా తీసుకుంటుందన్నారు. అందుకోసం ఎలాంటి దాడులకైనా వెనకాడదని అన్నారు. పాకిస్తాన్ తాలిబాన్‌కు ఈ దాడులు స్పష్టమైన, గట్టి హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. అయితే.. అఫ్ఘాన్ ప్రభుత్వం చెబుతున్నట్లు.. పౌర నివాసాలపై పాకిస్థాన్ దాడులు చేయలేదని, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే దెబ్బతీసేలా దాడులు జరిగాయన్నారు. పౌరుల ప్రాణ, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా పాకిస్తాన్ తగిన జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు.

దాడుల లక్ష్యం ఎవరు..

పాకిస్థాన్ జరిపిన ఈ దాడులు తెహ్రీ-కె-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) అనే గ్రూపు మిలిటెంట్లు లక్ష్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ఆ గ్రూప్.. ఇస్లామిస్ట్ అతివాద గ్రూప్, ఇది పాక్ – అఫ్ఘాన్ బోర్డర్ నుంచి తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ గ్రూప్ 2007లో బైతుల్లా మెహసూద్ అనే నాయకుడు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం నూర్ వలీ మెహసూద్ నాయకత్వంలో పనిచేస్తోంది. పాక్ లోని చాలా తాలిబన్ గ్రూపులు వీరితో కలిసి పని చేస్తున్నాయి. పాక్ సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడం, అక్కడ తీవ్రవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

ఈ గ్రూప్ ఆఫ్ఘన్ లోని తాలిబన్లకు మద్ధతు ఇస్తోంది. 2001-2021 మధ్య అమెరికాతో యుద్ధం సమయంలో తాలిబన్లకు అండగా నిలిచింది. ఈ కారణంగానే.. ఈ మిలిటెంట్ గ్రూప్ నకు తాలిబన్ల నుంచి గట్టి మద్ధతు లభిస్తోంది.

పెరిగిన తీవ్రవాదుల కార్యకలాపాలు

ఈ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులోని గిరిజన బెల్ట్‌ నుంచి తీవ్రవాదుల్ని రిక్యూట్ చేసుకుంటోంది. ఈ TTP ఆల్-ఖైదా నుంచి ఇస్లామిక్ తీవ్రవాదం, సైద్ధాంతిక మార్గాన్ని ఎంచుకొంది. మొదటి నుంచి ఆల్ ఖైదాతో సంబంధాలను కొనసాగిస్తోంది. కాగా.. ఈ సంస్థ కార్యకలాపాలు క్రమంగా బలపడుతుండడంతో ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాకిస్థాన్ సైనిక చర్యల్ని పెంచింది. అక్కడ ఈ తీవ్రవాద గ్రూప్ పై గట్టిగా దృష్టిపెట్టింది. దాంతో.. చాలా మంది టీటీపీ తీవ్రవాదులు.. పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు పారిపోయారు. ఆమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో సుమారు 30,000 నుంచి 35,000 మంది TTP తీవ్రవాదులు ఉన్నారు.

ఈ గ్రూప్ ను అణచివేసేందుకు పాక్ ప్రయత్నాలు

ఈ గ్రూప్ నుంచి ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించిన పాకిస్థాన్.. దీన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న సమయంలో.. టీటీపీ గ్రూప్ ను నిర్మూలించేందుకు ఆఫ్ఘన్ తాలిబాన్‌ నేతల్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ.. ఆ ప్రయత్నం జరగకపోగా, వారిని రక్షించేందుకు పాక్, టీటీపీ మధ్య చర్చలకు తాలిబన్లు మధ్యవర్తిత్వం వహించారు. ఈ చర్చల్లో భాగంగా.. పాకిస్థాన్ అదుపులో ఉన్న అనేక మంది టీటీపీ తీవ్రవాద ఖైదీలు విడుదలయ్యారు. పైగా.. ఇరుపక్షాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సైతం కుదిరింది.

పాక్ ఆర్మీపై పెరిగిన దాడులు

తాలిబన్ల అండదండలు, పాకిస్థాన్ నుంచి ప్రమాదం తగ్గడంతో తెహ్రీ-కె-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) గ్రూప్ క్రమంగా బలపడుతూ వచ్చింది. సైద్దాంతిక భావజాలాన్ని కలిగిన అనేక చిన్నచిన్న గ్రూపులు.. ఈ టీటీపీ గ్రూప్ తో కలిసిపోవడంతో.. దీని కార్యకలాపాలు పెరిగిపోయాయి. దీంతో.. ఆఫ్ఘనిస్తాన్‌లోని అభయారణ్యాల నుంచి పాకిస్తాన్ భద్రతా దళాలపై టీటీపీ దాడులను ప్రారంభించింది. సరిహద్దుల్లోని ఆర్మీ పోస్టులపై వరుస దాడులు చేస్తూ.. పాకిస్థాన్ సైన్యానికి సవాళు విసురుతున్నారు.

దీంతో.. ఈ గ్రూప్ కట్టడిపై ఆలోచన చేస్తున్న పాకిస్థాన్… పాక్ ఇంటిలిజెన్స్ అధికారుల పక్కా సమాచారం మేరకు ప్రస్తుత దాడులు చేసినట్లు చెబుతోంది.
గతంలోనూ అనేక సార్లు ఈ గ్రూప్ కార్యకలాపాలపై దాడులు చేసిన పాక్ ఆర్మీ.. అఫ్ఘాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం మొదటిసారి. 2022 ఏప్రిల్ 16న ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులలో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఆ సమయంలోనూ కొంత మంది టీటీపీ తాలిబన్లు ప్రాణాలు కోల్పోయారు.

Also Read : శాంతా క్లాజ్ ఏ దేశంలో ఉంటాడో తెలుసా?.. సమాధానం దొరికేసింది

ప్రస్తుతం పాకిస్థాన్ లోని రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని.. అక్కడి ఆర్మీ, సైనిక స్థావరాలపై తెహ్రీ-కె-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) వరుస దాడులు చేస్తోంది. వీటికి ప్రతీకారంగా.. పాక్ ప్రస్తుతం వైమానిక దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×