iPad 11 : ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ యాపిల్ త్వరలోనే కొత్త ఐప్యాడ్ ను లాంఛ్ చేయటానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఐప్యాడ్ ఫీచర్స్ లీక్ అయ్యి టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
యాపిల్ ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్న ఐప్యాడ్ 11.. జనవరిలో లాంఛ్ కాబోతుంది. ఇక ఇప్పటికే యాపిల్ లాంచ్ చేసిన ఎన్నో టాబ్లెట్స్ లో హై ప్రాసెసర్ ఉండగా.. ఈ టాబ్లెట్ లో A17 ప్రో ప్రాసెసర్ ఉండనున్నట్టు తెలుస్తోంది.
యాపిల్ తీసుకురాబోయే ఈ ఐప్యాడ్ వేరియంట్ కోసం ఎప్పటి నుంచో టెక్ ప్రియులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సరైన సమాచారం లేనప్పటికీ.. తాజాగా వచ్చే నెలలో లాంఛ్ కాబోతుందని తెలిసింది. ఇక iPad 11 వచ్చే సమయంలోనే iPadOS 18.3 లాంఛ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికీ ఐపాడ్ కోసం అందిన లీక్స్ తో యాపిల్ త్వరలోనే ఐప్యాడ్ 11 లో లేటెస్ట్ అప్డేట్స్ ను ఇన్స్టాల్ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వీటి ముందు జనరేషన్ ఐప్యాడ్స్ తో పోలిస్తే ఇవి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ తో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఆపిల్ ఐపాడ్ 11 జనవరిలో వచ్చేస్తుందని.. వైఫైతో పాటు 5G సేవలను అందించే విధంగా మొదటి వైర్లెస్ మోడల్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. A17 ప్రో ప్రాసెసర్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో ఈ ఐప్యాడ్.. యాపిల్ కంపెనీ పోర్ట్ఫోలియోలో అత్యంత తక్కువ ధరకే దొరికే గ్యాడ్జెట్ గా రాబోతుందని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ALSO READ : మీ ఆధార్ కార్డు వివరాలు ఎవరైనా దొంగలిస్తున్నారేమో ఇలా చెక్ చేసుకోండి.. ఎలా కాపాడుకోవాలంటే