Naman Ojha’s Father: టీమిండియా మాజీ క్రికెటర్ నమన్ ఓజాకు ( Naman Ojha ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మాజీ క్రికెటర్ నమన్ ఓజా ( Naman Ojha ) తండ్రికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ నమన్ ఓజా తండ్రి వినయ్ ఓజా ఓ బ్యాంకు దోపిడీకి ( Embezzlement Case ) పాల్పడ్డారు. ఈ కేసులో వినయ్ ఓజాతో పాటు నలుగురు ఉన్నారు. ఆ నలుగురికి కూడా కోర్టు శిక్ష విధించింది.
Also Read: Pv Sindhu Love Story: మొన్ననే పెళ్లి.. తన సీక్రెట్ లవ్ బయటపెట్టిన పీవీ సింధు?
ఈ కేసులో నిందితులైన వినయ్ ఓజా తో సహా మరో నలుగురు నిందితులకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అటు వినయ్ ఓజాకు ఏడు లక్షల రూపాయల జరిమాను కూడా… విధించింది కోర్టు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ( Bank of Maharashtra ) ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్రాంచ్ లో కొంతమంది 1.25 కోట్ల రూపాయలు… స్కాం చేశారు. అయితే ఈ నేరానికి పాల్పడిన వ్యక్తుల్లో అప్పటి అసిస్టెంట్ మేనేజర్ వినయ్ ఓజా ( ( Vinay Ojha ) ) కూడా ఒకరు.
అయితే ఈ కేసులో అభిషేక్ రత్నం అనే వ్యక్తి… అసలు సూత్రధారి. అతని పన్నాగం ప్రకారం… ఈ దోపిడీ చేశారు. ఈ ప్లాన్ చేసింది మొత్తం 6 గురని సమాచారం. అయితే.. ఈ సంఘటన 2013 సంవత్సరంలో జరిగింది. ఈ కేసును తాజాగా విచారించి.. కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తరుణంలోనే… బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ( Bank of Maharashtra ) నుంచి 1.25 కోట్ల రూపాయల చోరీకి పాల్పడిన కేసులో భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా తండ్రి వినయ్ ఓజాకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది.
Also Read: IND vs Aus 4th test: తెలుగోడికి షాక్.. నాలుగో టెస్ట్ కు ఆడే టీమిండియా జట్టు ఇదే !
2013 నాటి ఈ కేసు, 11 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపుగా ఓజాతో పాటు నలుగురికి కూడా శిక్ష విధించింది. భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా ( Naman Ojha ) తండ్రికి అక్రమాస్తుల కేసులో ( Embezzlement Case ) జైలు శిక్ష పడిన కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఇది ఇలా ఉండగా… నమన్ ఓజా… 2021లో క్రికెట్‌కు రిటైరయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ గా, అలాగే… భారత్ తరఫున నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.ఇటీవలే రిటైర్డ్ అయిన అశ్విన్‌తో కలిసి జూన్ 2010లో శ్రీలంకతో జరిగిన హరారేలో వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు ఓజా. ఐపీఎల్ లో హైదరాబాద్ కు కూడా ఆడాడు.
Four people, including Vinay Ojha, have been sentenced to imprisonment after more than a decade of legal proceedings. #NamanOjha #Insidesport #Cricket pic.twitter.com/tlPQaXAUWQ
— InsideSport (@InsideSportIND) December 25, 2024