Nu Republic Party Box 16: ఇంట్లో చిన్న పార్టీ జరిగినా, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడపాలన్నా మంచి మ్యూజిక్ సిస్టమ్ కచ్చితంగా ఉండాలి. మార్కెట్లో రకరకాల స్పీకర్లు ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం సౌండ్ క్వాలిటీ అందించే గ్యాడ్జెట్‌లకు ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. అలాంటి యూత్ కోసం ప్రముఖ బ్రాండ్ ‘న్యూ రిపబ్లిక్’ అద్భుతమైన స్పీకర్‌ను పరిచయం చేసింది. కేవలం రూ. 908 ధరకే లభిస్తూ, ఆర్జీబీ లైటింగ్స్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న Nu Republic Party Box 16 స్పీకర్ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.
ఈ స్పీకర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా , ప్రీమియం టైటానియం మెటల్ టెక్చర్‌తో వస్తుంది. దీని మెయిన్ అట్రాక్షన్ ఇందులో ఉండే మల్టిపుల్ ఆర్జీబీ ఎల్‌ఈడీ లైటింగ్ మోడ్స్. మనం వినే పాటల బీట్‌కు తగినట్లుగా లైట్లు మారుతూ ఇంటర్‌లో అచ్చం పార్టీ హాల్ లాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. సైజులో కాంపాక్ట్‌గా ఉండటం వల్ల దీన్ని ఎక్కడికైనా ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు.
చిన్న సైజులో ఉన్నప్పటికీ ఇది 16-వాట్ల (16W) ఆర్ఎంఎస్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇందులో.. ప్రత్యేకంగా అందించిన ‘X-Bass’ టెక్నాలజీ వల్ల బేస్ చాలా స్పష్టంగా, దద్దరిల్లిపోయేలా వినిపిస్తుంది. 2.0 ఛానల్ కాన్ఫిగరేషన్ మరియు 52ఎంఎం డైనమిక్ డ్రైవర్ల ద్వారా 360-డిగ్రీల సరౌండ్ సౌండ్ ఫీల్ పొందవచ్చు. సినిమా చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు థియేటర్ అనుభూతి కలుగుతుంది.
ఈ స్పీకర్‌లో బ్లూటూత్ లేటెస్ట్ వెర్షన్ 5.3 అవకాశం ఉంది. దీనివల్ల ఫోన్ లేదా ల్యాప్ టాప్‌కు క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. కేవలం బ్లూటూత్ మాత్రమే.. కాకుండా USB పోర్ట్, మైక్రో SD/TF కార్డ్, AUX కేబుల్ ద్వారా కూడా మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. దీని వల్ల ఏ రకమైన డివైజ్ నుంచి అయినా ఈజీగా పాటలు వినడానికి వీలవుతుంది.
ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీని ఎంజాయ్ చేయడానికి ఇందులో పవర్ ఫుల్ బ్యాటరీని ఇచ్చారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. దాదాపు 10 గంటల పాటు నాన్ స్టాప్ మ్యూజిక్ అందిస్తుంది. అంతేకాకుండా.. టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ అవకాశం ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
Also Read: రూ. 27వేలకే ఏఐ వాషింగ్ మెషీన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!
అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ న్యూ రిపబ్లిక్ పార్టీ బాక్స్ 16 బ్లూటూత్ స్పీకర్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వివిధ ఆన్‌లైన్ ప్లాట్ ఫారమ్‌లలో కేవలం రూ. 908 ధరకే అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ , కలర్ ఫుల్ స్పీకర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
అతి తక్కువ ధరలో డీసెంట్ బేస్, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఆర్జీబీ లైట్లతో కూడిన పార్టీ స్పీకర్ కావాలనుకునే.. వారికి న్యూ రిపబ్లిక్ పార్టీ బాక్స్ 16 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. కొనే ముందు ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభించే ఆఫర్లు లేదా డిస్కౌంట్లను చెక్ చేయడం మంచిది. ఆఫర్లను బట్టి ధరలలో మార్పులు ఉండొచ్చు.