E-Paper
Advertisement

గొప్ప మనసు చాటుకున్న అనిల్ రావిపూడి.. చిన్నారి తల్లికి అండగా!

గొప్ప మనసు చాటుకున్న అనిల్ రావిపూడి.. చిన్నారి తల్లికి అండగా!
Advertisement

సినిమా సెలబ్రిటీలు ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు అనడంలో సందేహం లేదు. ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీల గురించి చెప్పుకోవాలి. కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే ఎంత ఖర్చవుతుంది అని ఆలోచించకుండా సహాయం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరోసారి అనిల్ రావిపూడి వచ్చి చేరారు.. ప్రముఖ డైరెక్టర్ గా, హిట్ మెషిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే.. మరొకవైపు డ్రామా జూనియర్స్ అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

గొప్పమనసు చాటుకున్న అనిల్ రావిపూడి..

డ్రామా జూనియర్స్ సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక చిన్న ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా, స్టార్ హీరో శ్రీకాంత్ తో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తుండగా.. సుధీర్ హోస్ట్ గా చేస్తున్నారు. ఇకపోతే ఈ డ్రామా జూనియర్స్ సీజన్ 9 లో డైరెక్టర్ అనిల్ రావిపూడిని తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిచే చిన్నారి శ్రీవియా సరదాగా అందరినీ ఆటపట్టిస్తూ నవ్విస్తూ ఉంటుంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీవియా స్కిట్ పూర్తయిన తర్వాత సుధీర్ అసలు విషయం చెప్పుకొచ్చారు. శ్రీవియా తల్లి షూటింగ్ కి రాలేదని, ఇటీవల యాక్సిడెంట్ కి గురైందని, రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయని , ఇక వాళ్ల ఆర్థిక పరిస్థితి తెలుసుకొని అనిల్ రావిపూడి శ్రీవియా తల్లి హాస్పిటల్ ట్రీట్మెంట్ కి అయ్యే మొత్తం ఖర్చును భరించినట్లు తెలిపారు.

చిన్నారి తల్లికి అండగా..

Advertisement

ఇక ఈ విషయం చెప్పగానే శ్రీవియా స్టేజ్ పైనే ఏడ్చేసింది. శ్రీవియా తల్లి వీడియో మెసేజ్ ని కూడా ప్లే చేయగా ఆమె అనిల్ రావిపూడి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక శ్రీవియా స్టేజ్ పై కన్నీటి పర్యంతం అవడంతో షో కి వచ్చిన సెలబ్రిటీలు ,ఆడియన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. పైగా ఈ కార్యక్రమానికి గెస్ట్ గా లెనిన్ టీం తరఫున హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా వచ్చారు. ఇక వీరు కూడా కాస్త ఎమోషనల్ అయినట్టు చూపించారు. మొత్తానికైతే శ్రీవియా తల్లి హాస్పిటల్ ఖర్చులు మొత్తం భరించి గొప్ప మనసు చాటుకున్నారు అనిల్ రావిపూడి.

ALSO READ:ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

అనిల్ రావిపూడి సినిమాలు..

Advertisement

అనిల్ రావిపూడి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. అలాగే 2028 సంక్రాంతి టార్గెట్గా మరో హీరోని అప్పుడే అనిల్ రావిపూడి ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేసి మంచి విజయం లభించడంతో బాలయ్య మళ్ళీ అనిల్ రావిపూడికి అవకాశం ఇవ్వగా.. 2028 సంక్రాంతి బరిలో బాలయ్య అనిల్ రావిపూడి మూవీ నిలవనున్నట్లు సమాచారం.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×