Ola Shakti Battery| ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కొత్త రెసిడెన్షియల్ ఎనర్జీ బ్యాటరీ ప్రొడక్ట్ లాంచ్ చేసింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) టెక్నాలజీ ఆధారంగా ఓలా శక్తి పేరుతో దీన్ని తయారు చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి గిగాఫ్యాక్టరీ నుంచి ఈ సిస్టమ్ లాంచ్ అయింది. ఈ బ్యాటరీ లాంచ్‌తో ఓలా ఆటోమోటివ్ రంగం దాటి ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది ఇళ్లు, పొలాలు, చిన్న వ్యాపారాలకు పోర్టబుల్, ఆన్-డిమాండ్ ఎనర్జీ సొల్యూషన్‌గా రూపొందించారు.
ఓలా శక్తి పూర్తిగా ఇండియాలో డిజైన్ చేసి, తయారు చేసిన ఉత్పత్తి. ఓలా స్వదేశంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ ప్లాట్‌ఫాం ఉపయోగించారు. ఇది ఇంపోర్టెడ్ బ్యాటరీ టెక్నాలజీపై ఆధారపడకుండా స్వావలంబనను ప్రోత్సహిస్తుంది. ఇన్వర్టర్లు, డీజిల్ జనరేటర్లకు బదులుగా ఇది శుభ్రమైన, నిశ్శబ్దమైన ఎనర్జీ స్టోరేజ్ ఇస్తుంది.
ఓలా శక్తిలో ఆటోమోటివ్-గ్రేడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. పవర్ కట్ అయినప్పుడు జీరో-మిల్లీసెకండ్ ఇన్‌స్టంట్ స్విచ్ ఓవర్ ఉంది. ఇది అంతరాయం లేకుండా బ్యాకప్ ఇస్తుంది. 200V నుంచి 240V ఇన్‌పుట్ వోల్టేజ్ మధ్య పనిచేస్తుంది. IP67 రేటింగ్‌తో స్పిల్-ప్రూఫ్ బ్యాటరీ ప్రొటెక్షన్ ఉంది. దుమ్ము, నీరు, మాన్సూన్ పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ఉంటుంది. రన్నింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు దాదాపు జీరో అని కంపెనీ చెబుతోంది.
ఓలా శక్తి అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఫీచర్లతో వస్తుంది. రియల్-టైమ్‌లో బ్యాటరీ స్టేటస్ చూడవచ్చు. ఎనర్జీ ఫ్లో వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. యూజర్ ఎనర్జీ వినియోగ ప్యాటర్న్‌లను అనాలైజ్ చేసి సూచనలు ఇస్తుంది. ఇది ఎలక్ట్రిసిటీ బిల్లులను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంటి ఎనర్జీ మేనేజ్‌మెంట్‌కు స్మార్ట్ సొల్యూషన్.
ఓలా శక్తి నాలుగు వేర్వేరు కాన్ఫిగరేషన్లలో వస్తుంది.
1kW పవర్ + 1.5kWh కెపాసిటీ – ధర రూ.29,999
1kW పవర్ + 3kWh కెపాసిటీ – ధర రూ.59,999
3kW పవర్ + 5.2kWh కెపాసిటీ – ధర రూ.1,19,999
టాప్ మోడల్ 6kW పవర్ + 9.1kWh కెపాసిటీ – ధర రూ.1,59,99
ఈ సిస్టమ్‌లు ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇండక్షన్ కుకర్లు, ఫార్మ్ పంపులు, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్‌లను సులభంగా రన్ చేస్తాయి.
ఓలా శక్తి పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి సుమారు రెండు గంటలు పడుతుంది. ఫుల్ లోడ్‌లో 1.5 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది. బ్యాకప్ సమయం పవర్ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఎమర్జెన్సీ, రోజువారీ అవసరాలకు సరిపోతుంది.
Also Read: నిజ జీవితంలో జేమ్స్ బాండ్ గాడ్జెట్స్.. ఈ టెక్నాలజీ మీకూ కావాలా?
ఓలా శక్తి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఓలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 999 బుకింగ్ చేయవచ్చు. డెలివరీ టైమ్‌లైన్స్ ఇంకా ప్రకటించలేదు. ఉత్పత్తిని క్రమంగా పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఓలా శక్తి క్లీన్ ఎనర్జీ బ్యాకప్ సొల్యూషన్ ఇస్తుంది. ఇంధన ఖర్చులు, కాలుష్యం తగ్గుతాయి. ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాలకు సహాయపడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు దాటి ఎనర్జీ రంగంలో బలమైన స్థానం సంపాదిస్తోంది.