E-Paper
Advertisement

Hyderabad News: మంత్రి, అధికారులపై తప్పుడు కథనాలు.. జర్నలిస్టుల అరెస్టుని ఖండించిన జగ్గారెడ్డి

Hyderabad News: మంత్రి, అధికారులపై తప్పుడు కథనాలు.. జర్నలిస్టుల అరెస్టుని ఖండించిన జగ్గారెడ్డి
Advertisement

Hyderabad News: తెలంగాణలో మంత్రి, అధికారుల మీద వ్యక్తిగత ఆరోపణలు, కించపరిచేలా కొన్ని ఛానెళ్లు ప్రసారం చేశాయి. ఈ వ్యవహారంపై అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆ తరహా వార్తలపై విచారణ అవసరమేనని చెప్పిన ఆయన, పండుగ రోజు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అంతేకాదు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుందన్నారు.

తెలంగాణలో మంత్రి, అధికారులపై తప్పుడు కథనాలు

Advertisement

తెలంగాణలో ఐఏఎస్ అధికారి, మంత్రిపై వచ్చిన కథనాలపై తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కథనాలపై పలు న్యూస్ చానళ్లు, యూట్యూబ్ ఛానెళ్లపై కేసు నమోదు అయ్యాయి. ఈ కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ ఏర్పాటు అయిన గంటల వ్యవధిలో ఎన్‍టీవీ ఛానెల్ క్షమాపణలు కోరింది.

ఈ కేసులో ఇప్పటికే పలువురు జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చారు రాత్రి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తున్న NTV ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌ని ఎయిర్‌పోర్టు‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఛానెల్‌కి చెందిన ఇద్దరు రిపోర్టర్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై బుధవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు.

Advertisement

జర్నలిస్టుల అరెస్టుని ఖండించిన జగ్గారెడ్డి

మంత్రి, ఉన్నతాధికారుల మీద వ్యక్తి గతంగా ఆధారాలు లేకుండా కించపరిచే విధంగా కథనాలు వచ్చాయన్నారు. ఈ విషయంలో తొలుత తాను స్పందించానని వివరించారు. అలాంటి వార్తలు ప్రసారం చేయడం సమాజానికి మంచిది కాదన్నారు. మంత్రులు, ఐఏఎస్ కావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో తాను చెప్పానని గుర్తు చేశారు.

ఈ వార్తల వెనుక సూత్రధారులు ఎవరున్నారని తెలుసుకోవడానికి ప్రభుత్వం సిట్ విచారణ‌కు ఆదేశించందన్నారు. ఇది మంచిదేనని, సిట్‌లో సజ్జనార్ లాంటి సీనియర్ అధికారి‌తో వేయడం వల్ల అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. ఇలాంటి వార్తలు రాయడాన్ని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాల్సిందేనని కుండబద్దలు కొట్టేశారు.

ALSO READ: సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన, వివరాలు ఇవిగో

మహిళ అధికారిపై ఇలాంటి రాతలు రాయడాన్ని ఎవరూ సమర్థించరన్నారు. సిట్ అధికారులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎవరి మీద అనుమానం ఉందో వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే బాగుండేదన్నారు. పండుగ పూట సీనియర్ జర్నలిస్టులను విచారణ పేరుతో అరెస్టులు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.

ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అందువల్ల సిట్ అదికారులు కూల్‌గా సంయమనం పాటించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు చెప్పారు. అధికారులకు న్యాయం జరగాలని, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలన్నారు జగ్గారెడ్డి.

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×