E-Paper
Advertisement

Spy Gadgets In Real: నిజ జీవితంలో జేమ్స్ బాండ్ గాడ్జెట్స్.. ఈ టెక్నాలజీ మీకూ కావాలా?

Spy Gadgets In Real: నిజ జీవితంలో జేమ్స్ బాండ్ గాడ్జెట్స్.. ఈ టెక్నాలజీ మీకూ కావాలా?

Spy Gadgets James Bond Movies| జేమ్స్ బాండ్ సినిమాల్లో చూపించే గాడ్జెట్లు అసాధ్యంగా అనిపిస్తాయి. కానీ ఆ ఐడియాలతో నిజ జీవితంలోనూ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇంజినీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఆ గూఢాచారి డివైజ్‌లను రూపొందించారు. వీటిలో కొన్ని డివైస్‌లు మెడికల్, డిఫెన్స్ రంగాల్లో పెద్ద మార్పులు తెచ్చాయి. కోల్డ్ వార్ కాలంలో స్పై ఏజెన్సీలు కూడా బాండ్ సినిమాల నుంచి ప్రేరణ పొంది టూల్స్ టెస్ట్ చేశాయి. జేమ్స్ బాండ్ గాడ్జెట్లలో కొన్ని ఇప్పుడు నిజ జీవితంలోనూ అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని డివైజ్‌లు ఇవే..

X-రే విజన్ టెక్నాలజీతో మెడికల్ గ్లాసెస్

1999లో వచ్చిన ‘ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్’ సినిమాలో హీరో జేమ్స్ బాండ్ X-రే గ్లాసెస్ ఉపయోగిస్తాడు. ఆ గ్లాసెస్ దుస్తుల లోపల దాగి ఉన్న ఆయుధాలను చూపిస్తాయి. నిజమైన X-రే విజన్ ఇంకా సాధారణ వినియోగంలో రాలేదు. కానీ ఈ ఐడియా మెడికల్ ఇమేజింగ్‌ను ప్రేరేపించింది. ఈవెనా మెడికల్ అనే కంపెనీ ‘ఐస్-ఆన్ గ్లాసెస్’ తయారు చేసింది. ఇవి నియర్-ఇన్‌ఫ్రారెడ్ లైట్, 3D ఇమేజింగ్ ఉపయోగించి చర్మం కింద నరాలను స్పష్టంగా చూపిస్తాయి. ఇంజెక్షన్లు, బ్లడ్ తీసేటప్పుడు డాక్టర్లకు చాలా ఉపయోగకరం. కంపెనీ 2017లో మూసివేయబడినా, ఈ ఆవిష్కరణ హెల్త్‌కేర్ టెక్నాలజీకి మార్గం చూపించింది.

బయోనిక్ ఆర్మ్స్, అడ్వాన్స్‌డ్ ప్రోస్థెటిక్స్

1962లో వచ్చిన ‘డాక్టర్ నో’లో విలన్ మెకానికల్ ఆర్మ్స్ (ఇనుప యంత్రాల్లాంటి చేతులు) ఉపయోగిస్తాడు. ఆ ఆర్మ్స్ కోల్పోయిన చేతుల స్థానంలో పనిచేస్తాయి. ఇప్పుడు నిజమైన ప్రోస్థెటిక్స్ ఆ కల్పన కంటే ముందుకు వెళ్లాయి. i-LIMB బయోనిక్ హ్యాండ్ ప్రతి వేలిని విడిగా కదపగలదు. కండరాల సిగ్నల్స్ ద్వారా యూజర్ కంట్రోల్ చేస్తాడు. గ్రిప్, డెక్స్టరిటీ మళ్లీ వస్తాయి. సూపర్ హ్యూమన్ స్ట్రెంథ్ ఇవ్వదు కానీ, రోజువారీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది.

సబ్‌మెరైన్ కార్ డ్రీమ్ నిజమైందా?

1977లో వచ్చిన ‘ది స్పై హూ లవ్డ్ మీ’లో బాండ్ నీటి కింద కారు నడిపిస్తాడు. లోటస్ ఎస్ప్రిట్ సబ్‌మెరైన్‌గా మారుతుంది. ఇప్పటి వరకు పూర్తిగా అలాంటి కారు లేదు. కానీ గిబ్స్ అక్వాడా లాంటి ఆంఫిబియస్ వెహికల్స్ ఉన్నాయి. రోడ్డు మీద, నీటి లోపల రెండింట్లోనూ వేగంగా ప్రయాణించగలవు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఒరిజినల్ లోటస్ ప్రాప్ కొన్నాడు. ఆ డిజైన్ ఫ్యూచరిస్టిక్ వెహికల్స్‌కు ప్రేరణ ఇచ్చింది.

బయోమెట్రిక్ వెపన్ సెక్యూరిటీ సిస్టమ్స్

2012లో వచ్చిన ‘స్కైఫాల్’లో జేమ్స్ బాండ్ చేతిలో ఉండే గన్ అతని అరచేయిని బయోమెట్రిక్ స్కాన్ చేసి.. అతను మాత్రమే దాన్ని కాల్చేలా ఉంటుంది. అంటే ఆ స్పెషల్ తుపాకీతో పాటు బాండ్ మాత్రమే షూట్ చేయగలడు. ఇప్పుడు అలాంటి బయోమెట్రిక్ సెక్యూరిటీ గన్స్ ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్లు ఉన్న బయోఫైర్ స్మార్ట్ గన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దీనికి యాక్సెస్ ఉన్నవారు మాత్రమే యాక్టివేట్ చేయగలరు. ఈ టెక్నాలజీతో ఈ గన్స్ మరెవరూ దొంగతనం చేయలేరు. ఇతరుల చేతికి చిక్కినా ప్రమాదవశాత్తు ఇది పేలదు.

Also Read: ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ కొంటే పాత ఫోన్ డెలివరీ.. ఎలా గుర్తుపట్టాలంటే

మైక్రోచిప్ ట్రాకింగ్, న్యూరల్ ఇంప్లాంట్స్

2006లో వచ్చిన ‘క్యాసినో రాయల్’ సినిమాలో బాండ్‌కు ట్రాకింగ్ చిప్ పెడతారు. లొకేషన్, వైటల్ సైన్స్ మానిటర్ చేస్తుంది. ఇప్పుడు RFID చిప్స్ పెంపుడు జంతువులు, పశువులను ట్రాక్ చేస్తాయి. న్యూరల్ ఇంప్లాంట్స్ బ్రెయిన్ సిగ్నల్స్‌తో డివైస్‌లను కంట్రోల్ చేస్తాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ లాంటి కంపెనీలు ఈ రంగంలో ముందున్నాయి.

కాల్పనిక గాడ్జెట్స్ నిజజీవితంలో ఎలా?

జేమ్స్ బాండ్ గాడ్జెట్లు ఇప్పటికీ నిజమైన ఆవిష్కరణలకు ప్రేరణ ఇస్తున్నాయి. శాస్త్రవేత్తలు ముందు వీటిని ఊహించ ఆ తరువాత తయారు చేయడానికి ప్రయోగాలు చేస్తున్నారు. కల్పన, రియాలిటీ మధ్య గ్యాప్ తగ్గుతోంది. అన్నీ ఇంకా రాలేదు కానీ ప్రయోగాలు సాగుతున్నాయి.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×