E-Paper
Advertisement

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!
Advertisement

Old Android Phone: ఇంట్లో కొన్ని గదుల్లో Wi-Fi సిగ్నల్ సరిగ్గా రావడం లేదా? దీనికోసం వెంటనే కొత్త రూటర్ లేదా వైఫై ఎక్స్‌టెండర్ కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉపయోగించని పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే.. దానితోనే వైఫై సిగ్నల్‌ను మరో ప్రాంతానికి అందించేలా ట్రై చేయొచ్చు. రూపాయి ఖర్చు లేకుండా తాత్కాలికంగా వైఫై సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

పాత ఫోన్‌తోనే వైఫై..

మీ వద్ద ఉన్న పాత ఆండ్రాయిడ్ ఫోన్‌ను ముందుగా మీ ఇంటి వైఫైకి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌లోని హాట్‌స్పాట్ ఫీచర్‌ను ఆన్ చేస్తే.. ఆ ఫోన్ మరో వైఫై సిగ్నల్‌లా పనిచేస్తుంది. రూటర్‌కు దూరంగా ఉన్న కొన్ని డివైజ్‌లను ఫోన్ హాట్‌స్పాట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

ముందు వైఫైకి కనెక్ట్ చేయాలి..

Advertisement

పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి వైఫై లేదా నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ ఆప్షన్‌లోకి వెళ్లండి. మీ ఇంటి వైఫై నెట్‌వర్క్‌ను ఎంచుకుని పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి కనెక్ట్ చేయండి.

Also Read: AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

హాట్‌స్పాట్ ఆన్ చేయడం..

Advertisement

ఇప్పుడు సెట్టింగ్స్‌లో హాట్‌స్పాట్ లేదా టెథరింగ్/ వైఫై హాట్‌స్పాట్ ఆప్షన్‌ను ఓపెన్ చేయండి. అక్కడ హాట్‌స్పాట్‌ను ఆన్ చేయండి. అవసరమైతే నెట్‌వర్క్ పేరు, పాస్‌వర్డ్‌ను కూడా మార్చుకోవచ్చు. మీ ఫోన్‌లో 5GHz హాట్‌స్పాట్ ఆప్షన్ ఉంటే.. దగ్గరలోని డివైజ్‌లకు మెరుగైన స్పీడ్ కోసం దాన్ని ఎంచుకోవచ్చు.

ఫోన్ ఎక్కడ పెట్టాలి?

ఫోన్‌ను రూటర్‌కు, వైఫై సిగ్నల్ సరిగ్గా రాని ప్రాంతానికి మధ్యలో ఉంచడం మంచిది. ఇలా చేస్తే ఫోన్‌కు రూటర్ సిగ్నల్ బాగా అందుతుంది. అదే సమయంలో ఫోన్ హాట్‌స్పాట్ ద్వారా మరో ప్రాంతానికి కనెక్షన్ ఇవ్వగలదు. అలాగే హాట్‌స్పాట్‌ని నిరంతరం ఆన్‌లో ఉంచితే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కాబట్టి ఫోన్‌ను ఛార్జర్‌కు కనెక్ట్ చేసి ఉంచడం మంచిది.

పాత ఫోన్ సరిపోతుందా?

అయితే ఇలా చేయడం శాశ్వత పరిష్కారం కాదు. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరగదు. ప్రత్యేక వైఫై ఎక్స్‌టెండర్ లేదా మెష్ వైఫై సిస్టమ్ ఇచ్చే రేంజ్, పనితీరు పాత ఫోన్‌తో రాకపోవచ్చు. అయితే ఇంట్లో ఒక చిన్న గదిలో మాత్రమే వైఫై సిగ్నల్ సమస్య ఉంటే.. కొత్త డివైజ్ కొనకుండా పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఈ ట్రిక్‌ను ఒకసారి ట్రై చేయొచ్చు.

Also Read: ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Related News

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×