E-Paper
Advertisement

OnePlus 13Rపై రూ.10,000 తగ్గింపు.. నిమిషాల్లోనే హోమ్ డెలివరీ, ఎలాగో తెలుసా?

OnePlus 13Rపై రూ.10,000 తగ్గింపు.. నిమిషాల్లోనే హోమ్ డెలివరీ, ఎలాగో తెలుసా?
Advertisement

OnePlus 13R Price Cut: సాధారణంగా వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు అంటేనే యువతలో మంచి క్రేజ్ ఉంటుంది. చాలామంది ఇష్టపడి కొనుగోలు చేసే బ్రాండ్ కూడా అదే. అయితే, బడ్జెట్ వల్ల కొంతమంది ప్రీమియం మోడల్స్ కొనడానికి కాస్త ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ క్రేజీ ఆఫర్. OnePlus 13R ఫోన్ మీద ఇప్పుడు కళ్లు చెదిరే రేంజ్‌లో ధర తగ్గింది. ఆఫర్లు అన్నీ కలుపుకుంటే ఈ ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకే దొరుకుతోంది. ఆ వివరాలు మీకోసం..

ధర భారీగా తగ్గింది..

ఈ OnePlus 13R మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని ధర రూ.42,999. కానీ ఇప్పుడు ఏకంగా రూ.10,000 డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడీ ఫోన్‌ను రూ.32,999కే సొంతం చేసుకోవచ్చు. ఒక మిడ్‌రేంజ్ ఫోన్ ధరకే ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు వస్తున్నాయన్నమాట. అంతేకాకుండా.. HSBC లేదంటే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 5 శాతం అదనపు డిస్కౌంట్ కూడా కొట్టేయొచ్చు.

Advertisement

Also Read: భారత్‌లో Vivo X300 సిరీస్ లాంచ్ ఖరారు.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో అరాచకం!

నిమిషాల్లోనే ఇంటికి..

సాధారణంగా ఫోన్ ఆన్‌లైన్‌లో కొంటే డెలివరీ ఎప్పుడు వస్తుందా? అని రోజుల తరబడి ఎదురుచూడాలి. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. మనం సరుకులు ఆర్డర్ చేసే Zepto యాప్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. కొన్ని సిటీల్లో అయితే ఆర్డర్ పెట్టిన 10 నుంచి 15 నిమిషాల్లోనే ఫోన్ యూజర్ చేతిలో ఉంటుంది. కొత్త ఫోన్ కోసం వెయిట్ చేసే ఓపిక లేని వారికి నిజంగానే ఇది సూపర్ ఐడియా.

అదిరిపోయే డిస్‌ప్లే..

Advertisement

OnePlus 13Rలో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ మామూలు స్పీడ్ కాదు. భారీ గేమ్స్ ఆడినా, ఎన్ని యాప్స్ వాడినా ఫోన్ అస్సలు ఆగదు. దీనికి తోడు 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. డిస్‌ప్లే కూడా అదిరిపోతుంది కాబట్టి.. వీడియోలు చూస్తున్నప్పుడు ఆ క్వాలిటీ చూసి ఎవ్వరైనా ఫిదా అయిపోతారు.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది. జూమ్ చేసినా క్లారిటీ తగ్గకుండా ఉండేలా టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చారు. అలాగే 6000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ఈ ఫోన్ వర్షంలో తడిసినా లేదంటే చేతులు తడిగా ఉన్నప్పుడు పట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దీనిలో ఆక్వా టచ్ అనే ఫీచర్ ఉండటం వలన ఎక్కువ రోజులు మన్నుతుంది. మొత్తానికి మంచి బ్రాండ్, పవర్‌ఫుల్ ఫీచర్లు, తక్కువ ధర.. ఈ మూడు కలగలిసిన వన్‌ప్లస్ 13R ఇప్పుడు బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.

Also Read: BSNL సిమ్ తీసుకుంటున్నారా? ముందు మీ ఏరియాలో సిగ్నల్ వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×