E-Paper
Advertisement

మహిళా బిల్లును అడ్డుకొని.. తెలంగాణకు అన్యాయం చేశారు.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మహిళా బిల్లును అడ్డుకొని.. తెలంగాణకు అన్యాయం చేశారు.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Kishan Reddy: ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అడ్డుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకొని దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణకు జరిగే లాభాన్ని అడ్డుకున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ నిర్ణయాలు, వారి ప్రకటనలు దేశానికి వ్యతిరేకంగా పరిణమిస్తున్నాయని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నుంచి దేశ ప్రజలు ఆశించాల్సిన అంశాలు ఏమీ లేవని ఎద్దేవా చేశారు.

Advertisement

గతంలో ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్స్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. సైనికులను అవమానించేలా ఉన్నాయని గుర్తుచేశారు. సైనికుల శక్తి యుక్తులను అవమాన పరిచేలా రాహుల్ గాంధీ తీరు ఉంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మార్గ దర్శకుడు, అత్యంత సన్నిహితుడైన అసదుద్దీన్ ఓవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే మహిళా బిల్లును రాహుల్, రేవంత్ అడ్డుకున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

ఇది మోదీ ఓటమి అంటూ కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని వాస్తనానికి ఇది 70 కోట్లమంది మహిళల ఓటమి అని ఆయన అన్నారు. బీజేపీ పార్టీ చీఫ్ గా మహిళను ఎప్పుడైనా చేశారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్నపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని కానీ, మహిళను కానీ సీఎం చేశారా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

Advertisement

Also Read: డేంజరస్ డేటింగ్ యాప్స్.. క్యూట్ అమ్మాయిలతో వల.. దొరికారో తాట తీసేస్తారు!

మహిళా బిల్లును అడ్డుకొని తెలంగాణలో పెద్ద పోర పాటును కాంగ్రెస్ చేసిందని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని 70 కోట్లమంది మహిళలను బీజేపీ ఆధ్వర్యంలో ఊరూరా వెళ్లి కలుస్తామని కిషన్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఎన్డీయేతర పక్షాల విమర్శలను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీ కూడా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

Also Read: తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే.. మీరేం ప్రశ్నించరా? బీజేపీ ఎంపీలపై హరీశ్ రావు ఫైర్

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×