E-Paper
Advertisement

OnePlus 15 Review: వన్ ప్లస్ 15 రివ్యూ.. భారీ బ్యాటరీతో పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్

OnePlus 15 Review: వన్ ప్లస్ 15 రివ్యూ.. భారీ బ్యాటరీతో పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్
Advertisement

OnePlus 15 Review: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గత కొంత కాలంగా వన్‌ప్లస్ హవా క్రమంగా తగ్గిపోతోంది. కోల్పోయిన పట్టును మళ్లీ సాధించాలని వన్‌ప్లస్ 15 గ్రాండ్‌గా తీసుకొచ్చింది. అయితే ఈ సారి కొత్త ఫోన్ లో కెమెరా పై కాకుండా పెర్ఫామెన్స్, బ్యాటరీపై దృష్టి పెట్టింది. గేమర్స్, హెవీ యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

డిజైన్: బలంగా, సింపుల్‌గా

వన్‌ప్లస్ 15లో స్క్వేర్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ ఫ్రేమ్ ఉన్నాయి. మూడు కలర్స్ – సాండ్ స్టార్మ్, ఇన్ఫినిట్ బ్లాక్, అల్ట్రా వయొలెట్. సాండ్ స్టార్మ్ వెర్షన్‌లో ఫైబర్‌గ్లాస్ బ్యాక్ ఉంది, సిరామిక్ లాంటి ఫీల్ ఇస్తుంది. ఫింగర్ ప్రింట్స్ పడవు. IP66/IP69K రేటింగ్‌తో దుమ్ము, నీళ్ల సమస్య అసలు ఉండదు.

Advertisement

అలర్ట్ స్లైడర్ ని ఈ ఫోన్‌లో తొలగించేశారు. దానికి బదులు “ప్లస్ కీ” వచ్చింది. దీన్ని మైండ్ స్పేస్ లేదా షార్ట్‌కట్‌కు సెట్ చేయొచ్చు. అల్ట్రాసొనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వేగంగా, వేళ్లు తడిసినా పనిచేస్తుంది. ఫోన్ బరువు 211-215 గ్రాములు, చేతిలో పట్టుకోవడానికి బాగా ఉంటుంది.

డిస్‌ప్లే: స్మూత్, బ్రైట్

6.78 అంగుళాల LTPO OLED స్క్రీన్, 1.5K రిజల్యూషన్. 1-120Hz రిఫ్రెష్ రేట్, గేమింగ్‌లో 165Hz వరకు వెళ్తుంది. 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముందు మోడల్ 2K ఉండగా ఇప్పుడు 1.5Kకి తగ్గించారు. కానీ తేడా పెద్దగా కనిపించదు. నెట్‌ఫ్లిక్స్, యానిమే వీడియోలు కలర్‌ఫుల్‌గా స్మూత్‌గా కనిపిస్తాయి.

పెర్ఫామెన్స్: గేమింగ్ కింగ్

Advertisement

లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌తో ఇండియాలో అందుబాటులో ఉన్న మొదటి ఫోన్ వన్ ప్లస్ 15. 16GB RAM, 512GB స్టోరేజ్. కొత్త “గేమింగ్ ఆర్కిటెక్చర్” – OP గేమింగ్ కోర్, పర్ఫార్మెన్స్ ట్రై-చిప్ వంటివి CPU, GPU, టచ్ రెస్పాన్స్ మెరుగుపరుస్తాయి. CODMలో 165fps వరకు వస్తుంది. బెంచ్‌మార్క్ స్కోర్స్ రియల్‌మీ GT 8 ప్రోతో సమానంగా ఉన్నాయి. కానీ హెవీ టెస్టింగ్‌లో 58°C వేడి వచ్చి యాప్ క్రాష్ అయింది. రోజువారీ యూస్‌లో మాత్రం సూపర్ స్పీడ్ గా ఉంటుంది.

కెమెరా: డీటెయిల్‌మాక్స్ కొత్త టెక్నాలజీ

ఇంతకుముందు ఉన్న హాసెల్‌బ్లాడ్ వన్‌ప్లస్ పార్ట్‌నర్‌షిప్ తో ముగిసింది. కొత్త డీటెయిల్‌మాక్స్ ఇమేజ్ ఇంజన్ వచ్చింది. మూడు 50MP కెమెరాలు – సోనీ IMX906 మెయిన్, అల్ట్రా-వైడ్, 3.5x టెలిఫోటో. మంచి లైట్‌లో ఫొటోలు సహజంగా, రంగులు బాగున్నాయి. హై-కాంట్రాస్ట్ సీన్స్‌లో షాడో/హైలైట్స్ కొంచెం పోతాయి. లో-లైట్‌లో నాయిస్ కంట్రోల్ బాగుంది. సెకన్‌కు 10 ఫొటోలు తీయొచ్చు. 8K వీడియో, 4K 120fps, డాల్బీ విజన్ HDR సపోర్ట్ ఉంది.

బ్యాటరీ: రెండు రోజుల స్టామినా

7,300mAh బ్యాటరీ – భారీ అప్‌గ్రేడ్. 6 గంటల హెవీ యూజ్ (వీడియోలు, గేమింగ్) తర్వాత 51% మిగిలింది (అదే ఇంతకు ముందు మోడల్‌లో అయితే 12% మాత్రమే మిగిలింది). 120W వైర్డ్ చార్జింగ్‌తో 40 నిమిషాల్లో ఫుల్. 50W వైర్‌లెస్ కూడా ఉంది. సాధారణ యూజర్లకు 1.5-2 రోజులు సులువుగా ఉంటుంది.

తుది తీర్పు

దీని ప్రారంభ ధర రూ.72,999. వన్ ప్లస్ ఈ కొత్త ఫోన్ కోసం 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ ప్రకటించింది. కెమెరా టాప్-క్లాస్ కాదు, అలర్ట్ స్లైడర్ లేదు – కానీ స్పీడ్, బ్యాటరీ, గేమింగ్ అదిరిపోతాయి. పెర్ఫామెన్స్ ప్రేమికులకు వన్‌ప్లస్ 15 సూపర్ ఛాయిస్!

Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×