E-Paper
Advertisement

Smartphone Comparison: వన్‌ప్లస్ 15 vs గూగుల్ పిక్సెల్ 10.. రూ.70,000 ధరలో ఏది బెస్ట్?

Smartphone Comparison: వన్‌ప్లస్ 15 vs గూగుల్ పిక్సెల్ 10.. రూ.70,000 ధరలో ఏది బెస్ట్?
Advertisement

OnePlus 15 vs Google Pixel 10 Comparison| వన్‌ప్లస్ 15 ఫ్లాగ్ షిప్ ఫోన్ తాజాగా ఇండియాలో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర విషయంలో గూగుల్ పిక్సెల్ 10తో నేరుగా పోటీ పడుతోంది. రెండూ ప్రీమియం విభాగంలో ఉన్నాయి. మీ అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకోండి. అయితే వీటి ఫీచర్లను పోల్చి చూద్దాం.

ధర, వాల్యూ

వన్‌ప్లస్ 15 బేస్ మోడల్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ.72,999. బ్యాంక్ ఆఫర్లతో రూ.68,999కి తగ్గుతుంది. అదే వేరియంట్ లో గూగుల్ పిక్సెల్ 10 ధర రూ.79,999; డిస్కౌంట్ తర్వాత రూ.72,999 వరకు తగ్గుతుంది. సేమ్ వేరియంట్ కాబట్టి వాల్యూ పరంగా వన్‌ప్లస్ ముందంజలో ఉంది.

ప్రాసెసర్, పనితీరు

Advertisement

వన్‌ప్లస్ 15లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో అద్భుత పనితీరు ఇస్తుంది. పిక్సెల్ 10లో కస్టమ్ టెన్సర్ G5 చిప్ ఉంది. టెన్సర్ చిప్ AI, మెషిన్ లెర్నింగ్ టాస్కులకు ప్రత్యేకం. స్పీడ్‌లో స్నాప్‌డ్రాగన్ ఆధిపత్యం చూపుతుంది.

కెమెరా సిస్టమ్

పిక్సెల్ 10లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 48MP మెయిన్ + 13MP + 10.8MP. 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది. గూగుల్ సాఫ్ట్‌వేర్ ప్రాసెసింగ్ ఫోటోలను అద్భుతంగా చేస్తుంది. వన్‌ప్లస్ 15లో ట్రిపుల్ 50MP రియర్ + 32MP ఫ్రంట్. హార్డ్‌వేర్ రిజల్యూషన్‌లో కన్‌సిస్టెన్సీ ఉంటుంది. కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీకి పిక్సెల్, హార్డ్‌వేర్ పవర్‌కి వన్‌ప్లస్ బెస్ట్.

బ్యాటరీ, ఛార్జింగ్

Advertisement

వన్‌ప్లస్ 15లో 7300 mAh భారీ బ్యాటరీ, 120W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్. పిక్సెల్ 10లో 4970 mAh బ్యాటరీ ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ కాస్త నెమ్మదిగా అవుతుంది. బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్‌లో వన్‌ప్లస్ స్పష్టమైన విజేత.

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్

పిక్సెల్ 10: 6.3-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్.
వన్‌ప్లస్ 15: 6.78-అంగుళాల AMOLED, 165Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్. పెద్ద స్క్రీన్ , స్మూత్, ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియెన్స్‌లో వన్‌ప్లస్ ముందుంది.

ఏది ఎంచుకోవాలి?

వన్‌ప్లస్ 15 – గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్ కావాల్సినవారికి.
గూగుల్ పిక్సెల్ 10 – అద్భుత ఫోటోగ్రఫీ, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, AI ఫీచర్లు ప్రధానమైనవారికి ఇది బెస్ట్.

మీ ప్రధాన అవసరాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. రెండూ ప్రీమియం ఆప్షన్లు – మీ అవసరాలకు సరిపడే దాన్ని ఎంచుకోండి!

 

Also Read: వన్ ప్లస్ 15 రివ్యూ.. భారీ బ్యాటరీతో పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×