E-Paper
Advertisement

Parakamani Theft Case: పరకామణి కేసు.. సతీశ్‌ కుమార్‌ది హత్యే..! తేల్చి చెప్పిన వైద్యులు

Parakamani Theft Case: పరకామణి కేసు.. సతీశ్‌ కుమార్‌ది హత్యే..! తేల్చి చెప్పిన వైద్యులు
Advertisement

Parakamani Theft Case: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరకామని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి చెందారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై ఆయన విగత జీవిగా కనిపించారు. ప్రస్తుతం ఈ కేసును సీఐడీ బృందం విచారిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజన్స్ ఇన్పెక్టర్‌గా సతీష్ పనిచేస్తున్నారు. అతని మృతదేహం వెనుక కుట్రకోణం ఉండవచ్చని అనుమానిస్తున్నారు అధికారులు.

Advertisement

సతీష్ కుమార్ మృతదేహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, శరీరం వెనుక వెనుక భాగంలో మాత్రమే గాయాలు ఉండటంతో ఇది ప్రమాదం కాదు.. హత్యే అన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు.

ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ ఘటన రాత్రి 2 గంటల నుండి 3 గంటల మధ్యలోనే జరిగినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగిలినట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు అత్యంత కీలక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సతీష్ ప్రయాణిస్తున్న రైలు కోచ్‌లోనే అతనిపై దాడి జరిగి, తరువాత కిందికి తోసివేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

సతీష్ ప్రయాణించిన A1 బోగీలో ఆ సమయంలో ఎవరు ప్రయాణించారు? ఏ సీట్లలో ఎవరు ఉన్నారు? ఎవరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు, పోలీసులు ప్రయాణికుల పూర్తి లిస్ట్‌ను తెప్పించారు.

Also Read: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

ప్రస్తుతానికి ఆ బోగీలో ప్రయాణించిన వారికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, టికెట్ రికార్డులు, ఫోన్ లొకేషన్లు క్లుప్తంగా పరిశీలిస్తున్నారు. దాడి జరగడానికి ముందు, తరువాత కోచ్‌లో ఏవైనా వాగ్వాదాలు జరిగాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×