E-Paper
Advertisement

OnePlus 15T: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 7500mAh బ్యాటరీ.. వన్‌ప్లస్ 15T పెర్ఫార్మెన్స్ మాములుగా లేదుగా!

OnePlus 15T: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 7500mAh బ్యాటరీ.. వన్‌ప్లస్ 15T పెర్ఫార్మెన్స్ మాములుగా లేదుగా!
Advertisement

OnePlus 15T: ప్రముఖ చైనీస్ మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ తన 15 సిరీస్‌లో మరో పవర్‌ఫుల్ ఫోన్‌ను పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ‘OnePlus 15T’ పేరుతో రాబోతున్న ఈ కొత్త మోడల్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఉన్న OnePlus 15, 15R మోడళ్లకు తోడుగా ఈ కొత్త వేరియంట్‌ను కంపెనీ తీసుకురానుంది. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. ప్రముఖ టిప్‌స్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫోన్ ఏడాది నెలలో వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్‌లో వచ్చిన 13T కంటే.. నెల రోజుల ముందే ఈసారి కొత్త ఫోన్ మార్కెట్లో సందడి చేయనుంది.

OnePlus 15T ప్రత్యేకతలు:

ఈ ఫోన్ ఒక కాంపాక్ట్ స్మాల్ స్క్రీన్ ఫ్లాగ్‌షిప్‌గా రూపుదిద్దుకుంటోంది. భారత మార్కెట్లో దీనిని OnePlus 15S పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణుల అంచనా. దీని సైజు చిన్నదైనా పనితీరులో మాత్రం టాప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో అత్యంత వేగవంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్‌ను వాడుతున్నారు. దీనివల్ల హైఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్ చేసే వారికి ఎక్కడా అంతరాయం కలగకుండా మెరుగైన పనితీరు అందిస్తుంది.

Advertisement

Also Read: వర్త్ వర్మా వర్త్.. ఐఫోన్ 15,16,17లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్, ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు అంటే?

ఐదు రకాల స్టోరేజ్ వేరియంట్లు:

OnePlus 15T మొబైల్.. 6.31 అంగుళాల ఫ్లాట్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో, 1.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. నాలుగు వైపులా చాలా సన్నని బెజెల్స్‌తో వచ్చే ఈ స్క్రీన్ చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా కంపెనీ దీనిని 5 రకాల వేరియంట్లలో విడుదల చేయనుంది. 12GB RAM నుంచి 16GB RAM వరకు, అలాగే 256GB నుంచి 1TB వరకు భారీ స్టోరేజ్ ఆప్షన్లు దీనిలో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. 4 ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.

అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, భారీ బ్యాటరీ:

Advertisement

ఇకపోతే ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో టెలిఫొటో లెన్స్‌తో కూడిన కెమెరా సెటప్‌ ఉండనుంది. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, అలాగే సౌకర్యం కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా చేర్చనున్నారు. సుమారు 194 గ్రాముల బరువుండే ఈ ఫోన్ ఐపీ69 రేటింగ్‌తో ధూళి, నీటి నుంచి రక్షణను ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. దీనిలో 7,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చబోతున్నారు. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న టర్బో సిరీస్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్ కానుంది.

Also Read: కొత్త ఫోన్ కావాలా నాయనా?.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో iQOO 15పై క్రేజీ డిస్కౌంట్!

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×