E-Paper
Advertisement

Flipkart Republic Day Sale 2026: వర్త్ వర్మా వర్త్.. ఐఫోన్ 15,16,17లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్, ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు అంటే?

Flipkart Republic Day Sale 2026: వర్త్ వర్మా వర్త్.. ఐఫోన్ 15,16,17లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్, ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు అంటే?
Advertisement

Flipkart Republic Day Sale 2026: ఇటీవలె ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ల నుంచి హోమ్ అప్లయన్సెస్ వరకు అన్నింటిపై భారీ ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లు 10 శాతం అదనపు తగ్గింపుతో పాటు, ఇతర బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌ల ద్వారా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 17పై భారీ తగ్గింపు:

గతేడాది సెప్టెంబkiలో విడుదల అయిన iPhone 17పై ఫ్లిప్‌కార్ట్ తొలిసారి భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ.82,900 ధర ఉన్న ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు ఆకర్షణ ధర రూ.74,900కే లభిస్తోంది. దీనిలో 6.3 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, అత్యాధునిక A19 చిప్‌సెట్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 48MP డ్యూయల్ రియర్ కెమెరా, 18MP సెల్ఫీ కెమెరాను యాపిల్ దీనిలో అందించింది. నెలకు కేవలం రూ.6,909 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: తక్కువ ధరలో హై ఫీచర్స్.. 42dB నాయిస్ క్యాన్సిలేషన్‌తో రెడ్‌మీ బడ్స్ 8 లైట్ విడుదల!

ఐఫోన్ 16 మరింత తక్కువకే:

ప్రీమియం ఐఫోన్ అనుభూతిని బడ్జెట్ ధరలో పొందాలనుకుంటే.. iPhone 16 బెస్ట్ ఆప్షన్. సేల్‌లో దీని ధర దాదాపు రూ.56,999 కి పడిపోయింది. A18 చిప్‌సెట్‌తో శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ ఫోన్‌లో 48MP మెయిన్ కెమెరా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లకి అదనంగా రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుండటంతో.. EMI ఆప్షన్ ద్వారా నెలకు రూ.2,458 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

iPhone 15తో మరింత ఆదా:

Advertisement

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న సేల్‌‌లో iPhone 15 పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా దీని అసలు ధర కంటే రూ.10వేల నుండి రూ. 12వేల వరకు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. దీనికి అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మీరు భారీగా తగ్గింపు పొందవచ్చు. నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో.. తక్కువ నెలవారీ వాయిదాలలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

భారీ డిస్కౌంట్‌లో iPhone Air:

స్టైలిష్, స్లిమ్ డిజైన్‌ను ఇష్టపడే వారి కోసం వచ్చిన iPhone Airపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ.17,000 డైరెక్ట్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ ఇప్పుడు రూ.99,900కి అందుబాటులో ఉంది. 6.5 ఇంచ్ భారీ డిస్‌ప్లే, A19 అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ప్రీమియం మోడల్‌పై బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు ప్రయోజనాలు:

డైరెక్ట్ డిస్కౌంట్లే కాకుండా.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10% తక్షణ డిస్కౌంట్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా EMI కార్డులపై రూ.400 అదనపు తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తున్నాయి. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మీరు వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి రిపబ్లిక్ డే సేల్ నిజంగానే అద్భుతమైన అవకాశం.

Also Read: దేశీయ బ్రాండ్ నుంచి పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Related News

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Big Stories

Advertisement
×