E-Paper
Advertisement

United Flight: విమానం ల్యాండింగ్‌లో ఊడిన టైర్లు.. తప్పిన ప్రమాదం, వీడియో వైరల్

United Flight: విమానం ల్యాండింగ్‌లో ఊడిన టైర్లు.. తప్పిన ప్రమాదం, వీడియో వైరల్
Advertisement

United Flight: అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఓర్లాండో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానం ల్యాండ్‌ అవుతోంది. ఆ సమయంలో విమానం టైరు ఊడి పడ్డాయి. ఈ విషయంలో పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబందించి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం 

Advertisement

అమెరికాలోని చికాగోలోని ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఓర్లాండ్‌కు 206 మంది ప్రయాణికులతో UA2323 నెంబరు గల యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన  విమానం బయలుదేరింది. ఓర్లాండ్ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. సడన్‌గా విమానం ముందు టైరు ఊడిపోయింది. అది రన్‌వేపై పడిపోయింది.

ఆ సమయంలో విమానం ఊగిపోయింది. పరిస్థితి గమనించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

విమానం ల్యాండింగ్‌లో ఊడిన టైర్లు..  వీడియో వైరల్

రన్‌వే పడిన విమానం టైర్లను అధికారులు తొలగించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ఎయిర్‌పోర్టు నుంచి పలు విమానాలు ఆలస్యంగా బయలు దేరాయి. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

ఈ సంఘటన జరిగిన సమయంలో గాలులు బలంగా వీచాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఇలాంటి ఘటన ఎందుకు జరుగుతుందో అది పూర్తిగా వివరించలేదు.రెండేళ్ల కిందట శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరిన తర్వాత బోయింగ్ 777 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ చక్రం కోల్పోయింది. ఎగరడానికి సంబంధించినది కావడంతో పెద్దగా తెలియలేదు.  ప్రస్తుత ఘటనలో ప్రతికూల వాతావరణం పాత్ర పోషించిందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. దీనికి సంబంధించిన ఎయిర్‌పోర్టు అధికారులు విచారణ మొదలుపెట్టారు.

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×