E-Paper
Advertisement

OnePlus Ace 5 Pro: అసలుసిసలైన ఫోన్.. వన్‌ప్లస్ నుంచి మరో సిరీస్.. డిజైన్, ఫీచర్లు కుమ్మేసాయ్..!

OnePlus Ace 5 Pro: అసలుసిసలైన ఫోన్.. వన్‌ప్లస్ నుంచి మరో సిరీస్.. డిజైన్, ఫీచర్లు కుమ్మేసాయ్..!
Advertisement

OnePlus Ace 5 specifications leaks: టెక్ కంపెనీ OnePlus ఇప్పటికి చాలా మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. వరుసగా సామాన్యులకు, అలాగే బడా బాబులకు అందుబాటు ధరలలో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు మరోక మోడల్‌పై కంపెనీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్‌లో చైనాలో OnePlus Ace 5 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సిరీస్‌లో కంపెనీ రెండు మోడళ్లను తీసుకురానుంది. అందుటో OnePlus Ace 5, OnePlus Ace 5 Pro వంటి మోడళ్లు ఉన్నాయి.

త్వరలో రాబోయే ఈ ఫోన్‌లలో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉండవచ్చని సోషల్ మీడియాలో ఒక టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఇది కాకుండా ఈ హ్యాండ్‌సెట్ మిడ్-రేంజ్ నుండి హై-ఎండ్ మోడల్‌గా అందించబడుతుందని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా Ace 5 Proకి సంబంధించి ఓ లీక్ బయటకు వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Advertisement

OnePlus Ace 5 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి ఓ టిప్‌స్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Weiboలో రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి కొంత సమాచారాన్ని పంచుకున్నారు. దాని ప్రకారం.. OnePlus Ace 5 Pro స్మార్ట్‌ఫోన్‌ SM8750 మోడల్ నంబర్‌తో కూడిన చిప్‌సెట్‌తో వస్తుందని చెబుతున్నారు. అలాగే ఇది Snapdragon 8 Gen 4 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా ఇది అక్టోబర్‌లో జరిగే స్నాప్‌డ్రాగన్ 2024 సమ్మిట్‌లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఇది కాకుండా ఈ హ్యాండ్‌సెట్‌ 1.5k డిస్‌ప్లే పొందుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇది మైక్రో కర్వడ్ ఎడ్జెస్‌తో ఫ్లాట్ ఎప్పీరియన్స్‌తో వస్తుంది.

Also Read: మోటో నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. దీనవ్వ తగ్గేదే లే..!

Advertisement

టిప్‌స్టర్ ప్రకారం.. OnePlus Ace 5 Pro స్మార్ట్‌ఫోన్ దాని ముందున్న మోడల్‌తో పోలిస్తే చిన్న చిన్న డిజైన్ మార్పులను కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇది రైట్ యాంగిల్ మెటల్ మిడిల్ ఫ్రేమ్‌తో గాజు-సిరామిక్ బాడీని కలిగి ఉండవచ్చని తెలిపారు. OnePlus Ace 5 ఫోన్ గురించి ఇప్పటి వరకు లీక్ అయిన సమాచారం ప్రకారం.. OnePlus Ace 5 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K LTPO డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని చెప్పబడింది.

అలాగే ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హెడ్‌లైన్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని లీక్‌లు ద్వారా అర్థం అవుతుంది. అయితే దీన్ని శక్తివంతం చేయడానికి ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6200mAh డ్యూయల్ సెల్ బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉందని సమాచారం. వీటికి సంబంధించిన ఇతర సమాచారం త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×