E-Paper
Advertisement

jacqueline fernandez: సొంత ఐలాండ్‌.. బిజినెస్ ప్లాన్‌లో.. ఇంతకీ ఎక్కడో తెలుసా?

jacqueline fernandez: సొంత ఐలాండ్‌.. బిజినెస్ ప్లాన్‌లో.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
Advertisement

jacqueline fernandez: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ కొత్త అవతారం ఎత్తనుంది. ఇప్పటికే సొంతం ఐలాండ్ దక్కించుకున్న ఈ బ్యూటీ.. పనిలో పనిగా అక్కడ వ్యాపారం మొదలుపెట్టే ఆలోచన చేస్తోంది. ఇంతకీ ఐలాండ్ ఎక్కడో తెలుసా? అక్కడికే వచ్చేద్దాం.

హీరోయిన్ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ ఇప్పుడేం చేస్తోంది? బాలీవుడ్‌లో వెండితెరపై అప్పుడప్పుడు కనిపిస్తోంది. మునుపటి ఫామ్ మాత్రం సొంతం చేసుకోలేక పోతోంది. గడిచిన ఎనిమిదేళ్లలో ఒక్క హిట్ లేదు. అయినా ఆమె రేంజ్ ఏ మాత్రం తగ్గలేదనుకోండి.

Advertisement

జాక్వెలిన్ గతంలో సొంతంగా ఐలాండ్‌ను కొనుగోలు చేసింది. అప్పట్లో మూడు కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ ద్వీపాన్ని ప్రైవేట్ నివాసంగా ఉపయోగించుకోవాలని భావిస్తోందా ? వాణిజ్య ప్రయోజనాల కోసమా అనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.

ALSO READ: సాయిధరమ్ తేజ్ ని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. ఎందుకో తెలుసా?

Advertisement

ఇప్పుడు అక్కడ బిజినెస్ కోసం ప్లాన్ చేస్తోందట. అంతేకాదు బాలీవుడ్ షూటింగ్‌లు జరిపేలా ప్లాన్ చేస్తున్నట్లు బీటౌన్ సమాచారం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడో తెలుసా? బాలీవుడ్‌లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కు ఒకప్పుడు స్వర్ణయుగం.

2011-16 వరకు బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. మర్డర్-2, హౌస్‌ఫుల్-2, రేస్-2 వంటి సినిమాలు తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్టులు చేసింది.  వచ్చిన రెమ్యునరేషన్‌‌తో ఏకంగా ఐలాండ్‌ను కొనుగోలు చేసింది ఈ అమ్మడు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సొంతూరు శ్రీలంక కాగా, అక్కడే ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేసింది. మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కొనుగోలు చేసిన ద్వీపానికి సమీపంలో ఉంటుంది. జాక్వెలిన్‌ ఏ ముహూర్తాన అక్కడ ఐలాండ్ కొనుగోలు చేసిందో గానీ, పరిస్థితులు అనుకూలించలేదు.

దశాబ్దం పాటు శ్రీలంకను అంతర్గత సమస్యలు వెంటాడాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగుపడడంతో ఐలాండ్‌ను అభివృద్ధి చేసే పనిలో పడిందంట. టూరిస్టుల తాకిడి పెరగడంతో వ్యాపారం మొదలుపెట్టాలనే ఆలోచన చేస్తోందని సమాచారం.

తనకున్న పరిచయాలతో ఇటు సెలబ్రిటీలు, అటు బాలీవుడ్ షూటింగ్‌లు మొదలుపెట్టాలని స్కెచ్ వేసింది. నాలుగు పదుల వయస్సు దగ్గర పడడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన చేస్తోంది హీరోయిన్ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×