BigTV English

Jay Shah: అమిత్ షా పుత్రుడు జైషా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడా?

Jay Shah: అమిత్ షా పుత్రుడు జైషా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడా?

Jay Shah for the next ICC president will select unanimously: కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా అమిత్ షా సుపరిచితుడు. మోదీ ప్రతి విజయంలోనూ పాలు పంచుకుంటూ వెన్నెంటే ఉంటున్న అమిత్ షా, మోదీ ఇద్దరూ కలిస్తే రాజకీయ విజయం తథ్యం అంటారు రాజకీయ మేధావులు. వీరిద్దరూ కలిసి ప్రత్యర్థులపై అనేక వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో దూసుకుపోతుంటారు. అయితే అమిత్ షా తనయుడు జైషా గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం జైషా బీసీసీఐ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. మొదటినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న జైషా త్వరలో జరగనున్న ఐపీసీ చైర్మన్ పదవికి పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే జైషా ఈ ఎన్నికలో ఏకగ్రీవంగా గెలువబోతున్నట్లు సంకేతాలొస్తున్నాయి.


నవంబర్ 30తో పూర్తికానున్న పదవి

ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 30తో పదవీ కాలం ముగుస్తుంది. అయితే జైషా ఈ పదవికి పోటీచేయాలని ఆయన మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు. ఐసీసీ పదవికి ఎప్పుడూ పోటీ ఉంటుంది. దీనితో ఎన్నికల ప్రక్రియ ద్వారా ఐసీసీ చైర్మన్ ను ఎంపిక చేస్తారు. అయితే ఈ సారి ఎన్నికల ప్రక్రియ లేకుండా జైషా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీసీ బోర్డులో 16 మంది సభ్యులుంటారు. వారిలో 15 మంది సభ్యుల మద్దతు జైషాకే ఇస్తున్నట్లు సమాచారం. తొమ్మిది ఓట్ల మెజారిటీ వస్తే చాలు ఈ ఐసీసీ చైర్మన్ పదవికి. అయితే అనూహ్యంగా దాదాపు ఒక్కరు తప్ప మిగిలిన 15 మంది జైషాకే ఓటేయనున్నట్లు సమాచారం. దాదాపు తొంభై ఐదు శాతం మద్దతు జైషాకే ఉండటంతో ఎన్నికల ప్రక్రియ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఐసీసీ అంటే అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణ సంస్థ. ఇప్పటిదాకా భారత్ తరపున నలుగురు ఈ పదవిని నిర్వహించారు. ఎన్.శ్రీనివాసన్, జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్ ఇప్పటిదాకా భారత దేశంనుంచి ఐసీసీ చైర్మన్ పదవిని అలంకరించారు. ఇప్పుడు జైషా ఎన్నికయితే ఐదవ భారతీయ వ్యక్తిగా రికార్డు అవుతుంది.


Also Read: మావోలకు దెబ్బ మీద దెబ్బ.. 25 మంది లొంగుబాటు, బలహీనపడుతున్న మావోలు

జైషా ఒత్తిడి చేశారా?

అయితే జైషా పై కొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లేను ఆ పదవి నుంచి తప్పించడానికి జైషా తీవ్రంగా ఒత్తిడి చేయడం వలనే ఆయన తప్పుకోవాల్సి వస్తోందని అంటున్నారు. అయితే సీనియర్ భారత క్రికెట్ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఆ ఆరోపణలలో వాస్తవాలు లేవని, అవి నిరాధారమైనవని తీవ్రంగా ఖండించారు గవాస్కర్. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఐసీసీ మీటింగులలోనే మాట్లాడాలని..అప్పుడే తమ వాదనలు సైతం వినిపించాలని అన్నారు గవాస్కర్. ఐసీసీ చైర్మన్ పదవికి జైషా అన్ని విధాలుగా అర్హుడని కితాబునిచ్చారు. జైషా హయాంలో ప్రపంచ క్రికెట్ కు సంబంధించి గొప్ప మార్పులు సంభవిస్తాయని తాను నమ్ముతున్నానని గవాస్కర్ అన్నారు.

ఆసక్తి లేదన్నారు

ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎవరైనా రెండు లేక మూడు పర్యాయాలు ఉండవచ్చు. అయితే న్యూజిలాండ్ దేశానికి చెందిన బార్ క్లే ఇప్పటికే నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. అయితే తనంతట తానే మరో పర్యాయం పోటీ చేయడానికి ఆసక్తి లేదని ప్రకటించారు.దీనితో జైషా ఐసీసీ పదవి కోసం ఒత్తిడి తెచ్చాడనే ఆరోపణలకు తెరదించినట్లయింది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×