BigTV English

Moto New Smartphone: మోటో నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. దీనవ్వ తగ్గేదే లే..!

Moto New Smartphone: మోటో నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. దీనవ్వ తగ్గేదే లే..!

Moto G Stylus 2025: మోటో కంపెనీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. వరుస ఫోన్లను లాంచ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికి కంపెనీ ఎన్నో రకాల మోడళ్లను పరిచయం చేసింది. ఇక ఇప్పుడు మరో మోడల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. Motorola ఇప్పుడు Moto G Stylus 2025 పై పనిచేస్తోందని తెలుస్తోంది. ఇటీవలే Motorola Moto G Stylus 2024 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు దీనికి అప్‌డేటెడ్ వెర్షన్‌గా 2025 మోడల్ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా Moto G Stylus 2025 ఫోన్ గురించి కొన్ని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఇప్పుడు Moto G Stylus 2025 గురించి పూర్తిగా తెలుసుకుందాం.


తాజాగా దీనికి సంబంధించి ఓ నివేదిక వచ్చింది. దాని ప్రకారం.. XT251V అనే కోడ్ నేమ్ కలిగిన Moto G Stylus 2025 మోడల్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే 2024 మోడల్ వేగన్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉండగా.. 2025 మోడల్ కాస్త నిగనిగలాడే డిజైన్‌తో వస్తుందని అంటున్నారు. ఈ కొత్త ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుందని వెల్లడైంది. అలాగే వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్, స్మార్ట్‌ఫోన్ దిగువన ఉన్న స్టైలస్ హోల్డర్‌తో సహా ఇతర ఫీచర్లు అలాగే ఉంటాయని భావిస్తున్నారు. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. అయినప్పటికీ దాని పాత మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్ కొన్ని అప్డేట్‌లను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Moto G Stylus 2024 Specifications


Also Read: ఫ్లిప్‌కార్ట్ మాయాజాలం.. రూ.6,999లకే కొత్త మొబైల్.. మోటో, వివో, సామ్‌సంగ్ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!

Moto G Stylus 2024 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.7 అంగుళాల పూర్తి HD+ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బిల్ట్-ఇన్ స్టైలస్ స్మార్ట్‌ఫోన్ దిగువన ఉన్న స్లాట్‌లో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 5జీ ప్రాసెసర్ అందించబడింది. ఇది 8 GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.

దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. దీంతోపాటు సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. దీని ద్వారా ఫోన్ యజమానులు తప్పించే మరే ఇతర వ్యక్తులు ఫోన్ లాక్‌ను ఓపెన్ చేయలేరు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. వీటితో పాటు కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.

దీంతోపాటు 120° ఫీల్డ్ వ్యూతో 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఇది మాక్రో ఫోటోగ్రఫీకి కూడా మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరా 120FPS స్లో-మోషన్ ఎంపికతో 60FPS వద్ద పూర్తి HD వీడియోలను రికార్డ్ చేస్తుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది. అయితే ముందు కెమెరా డ్యూయల్ క్యాప్చర్ మోడ్‌ను అందిస్తుంది. ఇది డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో USB టైప్-C పోర్ట్ (USB 2.0), 3.5mm ఆడియో జాక్, 5G కనెక్టివిటీ, బ్లూటూత్ 5.1, డ్యూయల్-బ్యాండ్ వైఫై వంటివి ఉన్నాయి.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×