E-Paper
Advertisement

OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ గేమింగ్ ఫోన్.. 165Hz డిస్‌ప్లేతో అరాచకంరా అయ్యా!

OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ గేమింగ్ ఫోన్.. 165Hz డిస్‌ప్లేతో అరాచకంరా అయ్యా!
Advertisement

OnePlus Ace 6 Ultra: మార్కెట్‌లో షావోమీ, రెడ్‌మీ లాంటి దిగ్గజాలకు చెమటలు పట్టించేలా వన్‌ప్లస్ తన అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఏస్ సిరీస్‌లో భాగంగా ‘వన్‌ప్లస్ ఏస్ 6 ఆల్ట్రా’ పేరుతో ఒక పవర్‌ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేయబోతోంది. సాధారణంగా వన్‌ప్లస్ ఏస్ మోడళ్లు చైనాలో విడుదలయ్యాక, భారత్‌లో R సిరీస్ పేరుతో వస్తుంటాయి. అయితే ఈసారి రాబోతున్న ఈ ఆల్ట్రా వెర్షన్ స్పెసిఫికేషన్లు చూస్తుంటే మొబైల్ ప్రియుల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.

బ్యాటరీ లైఫ్‌ను పెంచే ఏఐ ఫీచర్లు:

ఈ వన్‌ప్లస్ ఏస్ 6 ఆల్ట్రాను ప్రధానంగా గేమర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో 6.8 అంగుళాల భారీ స్క్రీన్‌తో పాటు, కళ్లుచెదిరే 165Hz హైరిఫ్రెష్ రేట్‌ను ఇస్తున్నారు. దీనివల్ల గేమింగ్ గానీ, వీడియోలు చూడటం గానీ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దీనిలో లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను వాడుతున్నారు. ఇది కేవలం స్పీడ్‌ను మాత్రమే కాకుండా, బ్యాటరీ లైఫ్‌ను పెంచేలా ఏఐ ఫీచర్లతో పనిచేస్తుంది. అలాగే గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు అత్యాధునిక కూలింగ్ సిస్టమ్ కూడా దీనిలో ఉంటుందని సమాచారం.

Advertisement

Also Read: 9,000mAh బ్యాటరీతో ‘వన్‌ప్లస్ నోర్డ్ 6’ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర కూడా తక్కువే!

వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో కూడా:

వన్‌ప్లస్ కేవలం ఫోన్‌తోనే ఆగిపోకుండా, తన టాబ్లెట్ మార్కెట్‌ను కూడా విస్తరిస్తోంది. ఇదే సమయంలో వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో, ప్యాడ్ మినీలను కూడా రంగంలోకి దించుతోంది. 13.2 అంగుళాల భారీ డిస్‌ప్లేతో ప్యాడ్ 3 ప్రో వస్తుంటే.. కాంపాక్ట్ సైజు ఇష్టపడే వారి కోసం 8.8 అంగుళాల ప్యాడ్ మినీ సిద్ధమవుతోంది. ఇవి రెండూ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లతో హైఎండ్ పనితీరును అందిస్తాయి.

లాంచ్ ఎప్పుడంటే?

Advertisement

ఏస్ 6 ఆల్ట్రా డిజైన్ పరంగా చాలా అగ్రెసివ్‌గా, ప్రీమియం గ్లాస్ బ్యాక్ మెటల్ ఫ్రేమ్‌తో రానుంది. ఇండోర్స్‌లో కూడా సిగ్నల్ సమస్యలు రాకుండా మెరుగైన యాంటెన్నా సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. చైనాలో ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ ఫోన్, గ్లోబల్ మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 15T పేరుతో వచ్చే అవకాశం ఉంది. హైక్వాలిటీ గేమింగ్, వీడియో ఎడిటింగ్ చేసే వారికి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది.

Also Read: ఇంటర్నెట్ లేకపోయినా.. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకొనే ఎమర్జెన్సీ యాప్స్, మ్యాప్‌తో సహా అన్నీ!

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×