E-Paper
Advertisement

Srisailam Accommodation: శ్రీశైలం వెళ్తున్నారా..? వసతి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం

Srisailam Accommodation: శ్రీశైలం వెళ్తున్నారా..? వసతి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం
Advertisement

Srisailam Accommodation: శ్రీశైలం వెళ్తున్నారా..? అక్కడ వసతి గురించి టెన్షన్ పడుతున్నారా..? ఎలా ఉండాలి..? ఎక్కడ ఉండాలి అనే ప్రశ్నలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా…? అయితే మీ లాంటి వాళ్ల కోసమే ఈ కథనం. శ్రీశైలం వెళితే ఎక్కడ బస చేయాలి. ఎలా రూమ్స్‌ తీసుకోవాలి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రీశైల క్షేత్రంలో భక్తుల కోసం వసతి సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు మీ బడ్జెట్‌ను బట్టి దేవస్థానం గదులు, ప్రైవేటు హోటళ్లు లేదా వివిధ కులాల సత్రాలలో బస చేయవచ్చు. చివరకు దేశస్థానం డార్మిటరీ కూడా తక్కువ ధరలోనే దొరుకుంది. ఎప్పుడు శ్రీశైలం వెళ్లినా మీకు వసతి సంబంధించిన సమస్య అయితే అసలు ఉండదు.. ఇంకా కులాల సత్రాలలో రూమ్స్‌ తీసుకుంటే రెండు పూటలా ఇంటి వంట లాంటి భోజనం కూడా లభిస్తుంది.

Advertisement

దేవస్థానం వసతి (Srisaila Devasthanam): శ్రీశైల దేవస్థానం భక్తుల కోసం వివిధ రకాల సదనాలు మరియు కాటేజీలను నిర్వహిస్తోంది.వాటిలో ముఖ్యమైన సదనాలు గంగా సదన్‌, గౌరీ సదన్, మల్లికార్జున సదన్, పాతాళేశ్వర సదన్ లాంటివి ఉన్నాయి. వీటిలో నాన్‌ ఏసీ రూములకు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ధరలు ఉంటాయి. ఇక ఏసీ గదులకు విలాసవంతమైన కాటేజీలకు అయితే వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ధరలు ఉంటాయి. ఇక సామాన్య భక్తుల కోసం శ్రీశైలం దేవస్థానం డార్మిటరీ కూడా నిర్వహిస్తుంది. డార్మీటరీలో చాప లాకర్‌ అయితే ఒక్క రోజుకు 50 రూపాయలు, మంచం లాకర్‌ అయితే ఒక్క రోజుకు 100 రూపాయలు ఉంటాయి. నందీశ్వర డార్మిటరీ చాలా పెద్దగా విశాలవంగంగా ఉంటుంది. ఈ నందీశ్వర డార్మిటరీ కళ్యాణకట్ట  పక్కనే ఉంటుంది. ఇది 24 గంటలు ఓపెన్ ఉంటుంది.

ఎలా బుక్‌ చేసుకోవాలి: దేవస్థానం ఆఫీసియల్‌ వెబ్‌సైట్‌లో గదులను బుక్‌ చేసుకోవచ్చు. ఆఫ్ లైన్‌లో కూడా నేరుగా వెళ్లి తీసుకోవచ్చు. అయితే రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అయితే ఆఫ్‌లైన్‌ లో గదులు దొరకవట. ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి.

Advertisement

ప్రయివేటు హోటల్స్‌ అండ్‌ కాటేజీలు: శ్రీశైలంలో ప్రయివేటు హోటల్స్‌ చాలానే ఉన్నాయి. చాలా హోటల్స్‌ ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌ లైన్‌ లో రూమ్స్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇక శ్రీశైలం దేవస్థానానికి దగ్గరలోని సున్నిపెంటలో ప్రయివేటు హోటల్స్, కాటేజీలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గదులు నాణ్యతను బట్టి రెండు వేల నుంచి ఐదు వేల వరకు అందుబాటులో ఉన్నాయి.

కుల సంఘాల సత్రాలు: శ్రీశైలం వచ్చే భక్తులకు ఎక్కువ మొత్తంలో గదులు కుల సంఘాల సత్రాలలో దొరుకుతాయి. మెజార్టీ భక్తులు ఈ సత్రాలలోనే బస చేస్తుంటారు. శ్రీశైలంలో దాదాపు అన్ని ప్రముఖ కుల సంఘాలకు చెందిన సత్రాలు ఉన్నాయి. ఇక్కడ తక్కువ ధరకే వసతితో పాటు రెండు పూటలా భోజన సదుపాయం (అన్నదానం) కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ శ్రీకృష్ణ యాదవ సత్రం, వాసవి సత్రం, బ్రహ్మణ కరివెన సత్రం, రాజుల సత్రం ఇలా మొత్తం 50 దాకా కుల సత్రాలు ఉండొచ్చు. ఈ సత్రాలలో గదులు పొందడానికి మీరు నేరుగా వెళ్లి సంప్రదించాల్సి ఉంటుంది. ఈ సత్రాలకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఉండదు.

ముఖ్య  గమనిక: శ్రీశైల క్షేత్రంలో కుల సంఘాల సత్రాలలో అయినా దేవస్థానం వసతి కేంద్రాలలో అయినా హోటల్స్‌ లో అయిన ఎక్కడైనా ఒక్కరికి రూము ఇవ్వరు.. ఒక్కరు వెళ్లితే డార్మిటరీలో ఉండొచ్చు.  ఆధార్‌ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు తప్పనిసరిగా ఉండాలి. శివరాత్రి, కార్తీకమాసం ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో గదులు దొరకవు..

ALSO READ: శ్రీశైల ఆలయం గురించి ఎవ్వరికీ తెలియని రహస్య విశేషాలు

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×